ఢీ 2 కాదు.. దూకుడు 2 రాదు!

సీక్వెల్స్ హావా తెలుగులో జోరుగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు పార్ట 2లు సీజ‌న్ కూడా న‌డుస్తోంది. శ్రీ‌నువైట్ల `ఢీ`కి సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. శ్రీ‌నువైట్ల – విష్ణు కాంబినేష‌న్ లో `డీ అండ్ డీ` అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. అయితే.. అంద‌రూ అనుకుంటున్న‌ట్టు ఇది `ఢీ`కి సీక్వెల్ కాదు. పూర్తిగా వేరే క‌థ‌. అస‌లు `ఢీ`కీ ఈ క‌థ‌కూ సంబంధ‌మే లేదు. ఈ విష‌యాన్ని శ్రీ‌నువైట్ల కూడా ధృవీక‌రించేశారు. “ఢీకి ఇది సీక్వెల్ కాదు. ఆ క‌థ‌లోని ల‌క్ష‌ణాలు ఇందులో ఏమాత్రం క‌నిపించ‌వు. అయితే.. క్యారెక్ట‌రైజేష‌న్ల‌లో మాత్రం ఢీ ఫ్లేవ‌ర్ క‌నిపిస్తుంది. సినిమా చూస్తున్న‌ప్పుడు ఏదో ఓ క్ష‌ణంలో.. ఢీ గుర్తొస్తుందంతే..“ అని క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు సీక్వెల్స్ అంటే ఇష్టం ఉండ‌ద‌ని, మ్యాజిక్ అనేది ఒకేసారి రిపీట్ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు శ్రీ‌నువైట్ల‌.

దూకుడుకి సీక్వెల్ వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై కూడా శ్రీ‌నువైట్ల క్లారిటీ ఇచ్చేశాడు. “దూకుడు 2 రాదు. అస‌లు ఆ ఆలోచ‌నే నాకు లేదు. ఎప్పుడైనా స‌రే, కొత్త క‌థ‌ల‌తోనే మ్యాజిక్ చేయ‌గ‌లం. మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు మ‌రోసారి వెళ్తే.. దూకుడు కంటే మంచి క‌థ‌తో వెళ్లాలి..“ అని చెప్పుకొచ్చాడు శ్రీ‌నువైట్ల‌. సో.. శ్రీ‌నువైట్ల చేస్తోంది ఢీ 2 కాద‌న్న‌ది థియేట‌ర్ల‌కు వెళ్లే ముందు ప్రేక్ష‌కులు గుర్తుంచుకుంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

మాన్సాస్ ట్రస్ట్‌లో చైర్మన్ చెప్పినట్లే జరగాలి : హైకోర్టు

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం.. ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేయడంపై చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.....

HOT NEWS

[X] Close
[X] Close