పరకాలపై కసిని వెళ్ళగక్కిన చిరంజీవి

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎన్నాళ్ళనుంచో మనసులో దాచుకున్న కసిని వెళ్ళగక్కటానికి రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటన ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. అదెలాగో చూడాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో 2009లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ గతంలో ప్రజారాజ్యంలో ఉండటం, సరిగ్గా 2009 ఎన్నికలముందు పార్టీకి రాజీనామాచేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీలోని అవకతవకలను, చిరంజీవి, అల్లు అరవింద్‌లను ఉతికి ఆరేసి పీఆర్‌పీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. పరకాల ప్రభాకర్‌పై నాటినుంచి దాచుకున్న కసిని వెళ్ళగక్కటానికి చిరంజీవికి ఇవాళ్టికి అవకాశం దొరికింది. రాజమండ్రి దుర్ఘటనపై చిరంజీవి ఇవాళ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాట్లలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైఫల్యాన్ని తప్పుబడుతూనే, పనిలో పనిగా పరకాలనుకూడా ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పరిపాలనాపరంగా ఏమాత్రం అవగాహనలేని వ్యక్తి మీకు ప్రభుత్వ సలహాదారుగా, పుష్కరాలవద్ద కీలక వ్యక్తిగా ఉండటమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. అతనికి ఏమి చేతవునని పెట్టుకున్నారంటూ పరోక్షంగా పరకాలను ఉద్దేశించి అడిగారు. అలాంటి కాకా రాయుళ్ళను పక్కన పెట్టుకుని, వాళ్ళమీద ఆధారపడి ముఖ్యమంత్రి పుష్కరపనులను సమీక్షించేవారని ఆరోపించారు. మొత్తంమీద అటు చంద్రబాబును, ఇటు పరకాలను తిట్టటానికి దొరికిన అవకాశాన్ని భలే ఉపయోగించుకున్నారు చిరు! ఫరవాలేదు రాజకీయ నాయకుడిగా బాగానే ఎదుగుతున్నారు.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close