చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

‘ఆచార్య‌’ త‌ర‌వాత‌… ‘వేదాళం’ రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో ‘వేదాళం’ సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం` షూటింగ్ మొద‌లైపోయింద‌ని, కొన్ని మాంటేజ్ షాట్లూ ఈ సినిమా కోసం తీసేశార‌ని టాక్‌. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అక్క‌డ ద‌స‌రా బ్ర‌హ్మాండంగా జ‌రుగుతుంది. ఆ నేప‌థ్యంలో చిత్ర‌బృందానికి కొన్ని మాంటేజ్ షాట్లు కావాల్సివ‌చ్చాయి.

అందుకే ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా.. చిత్ర‌బృందం కొల‌కొత్తా వెళ్లి, అక్క‌డి ఉత్సవాల‌ను షూట్ చేసి వ‌చ్చింద‌ట‌. ఆ ఫుటేజీని.. `వేదాళం` రీమేక్‌లో వాడుకోబోతున్నారు. ఆ ర‌కంగా… `వేదాళం` రీమేక్ మొద‌లైపోయిన‌ట్టే. 2021 ద‌స‌రా లోపు ఈ సినిమాని పూర్తి చేయాల‌ని భావిస్తున్నార్ట‌. అందుకే ఇప్పుడే ఆ ఉత్స‌వాల్ని క‌వ‌ర్ చేసి, ముందు జాగ్ర‌త్త‌గా దాచి పెట్టుకున్నారు. ఈ సినిమాలో చిరు గుండు గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో చిరు గుండుతో లుక్ టెస్ట్ కూడా చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. చిరు చెల్లాయి పాత్ర‌లో కీర్తి సురేష్ దాదాపు ఖాయ‌మైంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close