రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న రాత్రి విడుదల చేశారు. రూ. 590 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ..ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్ఆర్ – ఫసల్ బీమా యోజన పథకం కింద ఆ మొత్తం చెల్లిస్తున్నట్లుగా ప్రకటించారు. పంటల బీమా విషయంపై నిన్న అసెంబ్లీలో రచ్చ జరిగింది. రైతుల్ని దారుణంగా ముంచేశారని విపక్షాలు మండిపడ్డాయి. ఆ రగడ చంద్రబాబు సస్పెన్షన్‌కు దారి తీసింది.

ఈ క్రమంలో.. మొదటగా.. తాము ఇన్సూరెన్స్ కట్టామని వాదించిన ఏపీ సర్కార్ తర్వాత డిసెంబర్ పదిహేనో తేదీన కడతామంటూ మాట మార్చింది. ఇప్పుడు రాత్రికి రాత్రే రూ. 590 కోట్లు చెల్లించింది. అయితే ఇప్పుడు కట్టిన ఇన్సూరెన్స్‌ ఇప్పటి నుండి వర్తిస్తుంది కానీ.. ఇప్పటి వరకూ జరిగిన నష్టానికి వర్తించే అవకాశాలు లేవు. గత ఏడు నెలల కాలంలో జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు.. రైతులకు నష్టపరిహారం చెల్లించవు. ఇక ముందు జరిగే నష్టానికి మాత్రం… కట్టిన ప్రీమియం మేరకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది. వాస్తవానికి రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్ట వద్దని మొత్తం ప్రభుత్వమే కడుతుందని చెబుతూ వచ్చారు. ఫలితంగారైతులు కట్టలేదు. ప్రభుత్వం కూడా.. ఇవాళ.. రేపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే సొమ్ము ఎక్కువైపోతోందని అనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఏకంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌నే పెట్టాలని అనుకుంటోంది. ఇక ఏ కంపెనీకి కట్టకుండా.. ఏపీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహించి… విపత్తులు వచ్చినప్పుడు పరిహారం చెల్లిస్తుందన్నమాట. ఇది ఆచరణలో ఎలా సాధ్యమో కానీ.. ఈ కారణం చేతనే.. ప్రీమియం ఇంత కాలం కట్టలేదనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close