కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నిజానికి అక్కడి ఎస్‌ఈసీ కూడా గతంలో ఆరు నెలల పాటు ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తర్వాత నిర్వహించాలనుకున్నారు. ఎన్నికల నిర్వహణపై కొంత మంది కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో.. కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.

ప్రస్తుతం కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తోంది. కేసులు మెల్లగా పెరుగుతన్నాయి. అయినప్పటికీ.. అక్కడ రోజువారీ వ్యవహారాలకు పెద్దగా ఆటంకాలు కలగడం లేదు. అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ జాడ కూడా లేదు. గతంలో వేలల్లో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు.. రెండు, మూడు వందలు మాత్రమే నమోదవుతున్నాయి. మరణాలు, యాక్టివ్ కేసులు కూడా..భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం.. పెట్టేది లేనే లేదని అంటోంది. తన విధులకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన వాదిస్తున్నారు. అయితే.. ఓ వైపు హైదరాబాద్ ఎన్నికలు.. మరో వైపు కర్ణాటక పంచాయతీ ఎన్నికలు జరుగుతూండగా.. ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ఏపీ సర్కార్ మాత్రం కారణాలు ఏం చెప్పినా.. నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close