పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత మొత్తం రైతు.. ఎక్కువ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ.. బీమా ఉచితం.. ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తుందని ప్రకటించింది. దీంతో రైతులెవరూ ఒక్క రూపాయి కూడా బీమా కోసం చెల్లించలేదు. మరి ప్రభుత్వం చెల్లించిందా అంటే అదీ లేదు. ప్రభుత్వం కూడా బీమా చెల్లించలేదు. దీంతో రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఫలితంగా పంటలకు నష్టం జరిగినా.. బీమా సొమ్ము వచ్చే అవకాశం లేకుండా పోయింది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. దాని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఏపీ సర్కార్ కూడా అదే తరహాలో పథకాన్ని ఎంతో కాలం నుంచి అమలు చేస్తోంది. అందుకే.. అసెంబ్లీలోనే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించామని ప్రకటించారు. కానీ టీడీపీ సభ్యులు అబద్దాలు చెప్పొద్దని నిలదీశారు. పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని.. పత్రాలు చూపించారు. దీంతో కన్నబాబు నాలిక్కరుచుకున్నారు. డిసెంబర్ 15న ప్రీమియం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అప్పటిదాకా చెల్లించామని చెప్పి… ఇప్పుడు డిసెంబర్ పదిహేనో తేదీన చెల్లిస్తామని మాట మార్చడంతో చెల్లించలేదని స్పష్టమయింది. దీంతో రైతుల గుండెల్లో రాయి పడినట్లయింది.

ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా…. పూర్తిగా నష్టపోయినా… కనీసం పెట్టుబడిలో సగం అయినా పంటల బీమా ద్వారా రైతులు పొందేవారు. ఇప్పుడు.. అలాంటి అవకాశమే లేకుండా పోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎంత ఇస్తుందో క్లారిటీ లేదు. గతంలో జరిగిన నష్టానికి 13 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఏపీలో 70 లక్షల మంది వరకూ రైతులు ఉన్నారు. ఆ పదమూడు లక్షల మందికి సగటున రూ. మూడు వేలు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్ని ఆదుకునేది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ప్రభుత్వం నేరుగా సాయం చే్యకపోయినా.. బీమా ద్వారా రావాల్సిన దాన్ని కూడా.. రాకుండా చేసేశారు. ఫలితంగా రైతులు నిలువుగా మునిగిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close