చిరు సూప‌ర్ హిట్ రీమేక్‌.. ఓటీటీ కోసం

చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే. అందులో `దొంగ మొగుడు` ఒక‌టి. చిరంజీవి – రాధిక‌, చిరంజీవి – భాను ప్రియ‌ల జోడీ క‌నువిందు చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. పాట‌లూ హిట్టే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఓటీటీ కోసం.

`న‌ల్లంచు తెల్ల‌చీర‌` అనే యండ‌మూరి న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన‌చిత్రం `దొంగ‌మొగుడు`. న‌వ‌ల‌ని సినిమాటిక్ గా మార్చ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేశారు అప్ప‌ట్లో. ఇప్పుడు ఇంకొన్ని మార్పులు చేర్పులూ చేసి.. `న‌ల్లంచు తెల్ల‌చీర‌`ని తెర‌కెక్కించ‌బోతున్నారు. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. `స్టువ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్‌`తో.. యండ‌మూరి ద‌ర్శ‌కుడిగానూ మారిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ద‌ర్శ‌కుడిగా యండ‌మూరి త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయాడు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌… మ‌ళ్లీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు. ఓ హిట్ సినిమాని, ఓటీటీ కోసం రీమేక్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైతే, ఇలాంటి మ‌రిన్ని సినిమాలు తెర‌పైకొచ్చే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close