కృష్ణ‌వంశీ సినిమాకి `చిరు` సాయం

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `రంగ‌మార్తండ‌`. ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ధారి. చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌య్యింది. ఈ సినిమా కోసం చిరు త‌న వంతు సాయం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న గాత్ర‌దానం చేశారు. కొన్ని క‌వితాత్మ‌క పంక్తులు చిరు గొంతు నుంచి వినిపించ‌నున్నాయి. చిత్ర ప్రారంభంలో, చివ‌ర్లో.. చిరు గొంతు ప‌ద్య క‌విత ద్వారా వినిపిస్తారు.

ఈ పంక్తుల్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల రాశారు. రంగ‌స్థ‌ల నేప‌థ్యంలో సాగే చిత్రం రంగ‌మార్తాండ‌. క‌ళాకారుల జీవితాల్ని ఈ చిత్రంలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌బోతున్నారు. న‌టుడి జీవితాన్ని ఈ గ‌ద్య క‌విత ద్వారా ఆవిష్క‌రించ‌బోతున్నారు. అవ‌న్నీ చిరు గొంతులో వినిపిస్తే బాగుంటుంద‌న్న‌ది కృష్ణ‌వంశీ ఆలోచ‌న‌. చిరుకీ కృష్ణ‌వంశీకి మంచి అనుబంధం ఉంది. అందుకే కృష్ణ‌వంశీ అడిగిన వెంట‌నే.. చిరు ముందుకొచ్చి త‌న వంతు సాయం చేశారు. రంగ‌మార్తండ సినిమాకి చిరు వాయిస్ ఓ ప్ల‌స్ పాయింట్ కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీని గంట తిట్టి “ధాన్యం భారం” దించేసుకున్న కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం బీజేపీని...

వరద నష్టం అంచనాకొచ్చారా ? జగన్ పనితీరుకా ?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు...
video

30 సెకన్ల టీజర్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన రాధేశ్యామ్

https://youtu.be/ybq28UyxDTg పాన్ ఇండియా ఫ్యాన్స్ ని ఊరిస్తున్న సినిమాల్లో ప్రభాస్ "రాధేశ్యామ్" కూడా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రమోషన్స్ మెటిరియాల్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా హిందీ సాంగ్...

డ్వాక్రా మహిళల “పెన్షన్ బీమా” సొమ్ములు కూడా విత్ డ్రా !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close