ఈవారం బాక్సాఫీస్‌: ఒక‌టి క్లాస్, మ‌రోటి మాస్

ద‌స‌రా సీజ‌న్‌తో ఈ నెల ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ నెలంతా సినిమాల హ‌డావుడే. దీపావ‌ళి సీజ‌న్‌లో మ‌రిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈలోగా… కొత్త వారం వ‌చ్చేసింది. ఈ శుక్ర‌వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హ‌డావుడి క‌నిపించ‌బోతోంది. మొత్తంగా 4 సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే… అందులో రెండు సినిమాలు మాత్రం ప్రేక్ష‌కుల దృష్టిని త‌మ వైపుకు తిప్పుకున్నాయి.

ఆకాష్ పూరి `రొమాంటిక్‌` ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. పూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, క‌థ‌, మాట‌లు అందించారు. దాంతో ఇది పూరి సినిమాగానే చ‌లామ‌ణీ అవుతోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తుంటే ఫ‌క్తు మాస్ మ‌సాలా సినిమాలానే అనిపిస్తోంది. పూరి గ‌త సినిమాల ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా – కుర్ర‌కారుని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అంశాలు పుష్క‌లంగా ద‌ట్టించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాకి సంబంధించి రెండు ట్రైల‌ర్లు వ‌దిలారు. రెండిటిలోనూ డైలాగులు బాగా పేలాయి. దానికి తోడు ప్ర‌చారం కూడా కాస్త గ‌ట్టిగానే చేస్తున్నారు. ప్ర‌భాస్‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ లాంటి స్టార్ హీరోల‌ను రంగంలోకి దింపేస‌రికి ఆటోమెటిగ్గా – రొమాంటిక్ పై చ‌ర్చ మొద‌లైపోయింది.

ఈ మాస్ సినిమాకి తోడుగా విడుద‌ల అవుతున్న క్లాస్ సినిమా.. `వ‌రుడు కావ‌లెను`. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. రీతూవ‌ర్మ నాయిక‌. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సితార‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అది ఈ సినిమాకి బాగా ప్ల‌స్ పాయింట్. దానికితోడు.. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఓ పూర్తి స్థాయి కుటుంబ క‌థా చిత్రం చూడ‌బోతున్నామ‌న్న ఫీలింగ్ ఇచ్చింది ట్రైల‌ర్‌. శౌర్య – రీతూల జంట కూడా అందంగా కుదిరింది. దిగు దిగు దిగు నాథ‌.. పాట ఇప్ప‌టికే బాగా పాపుల‌ర్ అయిపోయింది. కుటుంబ ప్రేక్ష‌కుల‌తో పాటు, యూత్ కూడా థియేట‌ర్ల‌కు వ‌స్తే – బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల వాన కురిపించుకోవ‌డం ఖాయం.

ఈ సినిమాతో పాటుగా.. రావ‌ణ‌లంక‌, తీరం అనే మ‌రో రెండు చిత్రాలు ఈ వారం విడుద‌ల కానున్నాయి. కాక‌పోతే ప్ర‌చారం, స్టార్ కాస్టింగ్, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే రొమాంటిక్‌, వ‌రుడు కావ‌లెను చిత్రాల‌దే పై చేయి. మ‌రి ఈ రెండింటిలో ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకునే సినిమా ఏదో తెలియాలంటే రెండు రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close