మీడియా వాచ్ : టీడీపీకి తలవంపులు తెస్తున్న ఏబీఎన్ యూ ట్యూబ్ చానల్ !

రాజకీయాల్లో ప్రత్యర్థి ఎప్పుడూ మేలే చేస్తాడు. ఎందుకంటే అతడు ప్రత్యర్థి నేరుగా తలపడతాడు. అతన్ని గెలవాలని పోరాడతారు. కానీ సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చేవారితోనే అసలు ముప్పు ఉంటుంది. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. పక్కనే ఉండి నవ్వుల పాలు చేస్తారు. చేయాల్సినంత డ్యామేజ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి గ్రూప్ నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పేపర్‌, టీవీ చానల్ సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి యూట్యూబ్ చానల్ చేసే రచ్చ  మాత్రం వేరే వాళ్లు .. టీడీపీని .. చంద్రబాబును ట్రోల్ చేయడానికి కావాల్సినంత సరంజామా మొత్తం అందిస్తున్నారు.

“సింహంలా ఢిల్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు “, “ఉగ్రరూపంతో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న చంద్రబాబు”, “బాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీలో కలవరం”, “రాష్ట్రపతి ఆగ్రహం.. ఏపీలో పాలన మారే చాన్స్”, “ఢిల్లీలో ఉగ్రరూపం చూపించిన చంద్రబాబు వదిలేదే లే” అంటూ సాగిన థంబ్‌నెయిల్స్‌తో సోషల్ మీడియా నింపేశారు. వైసీపీ ట్రోలర్స్‌కు కావాల్సినంత మేతను ఏబీఎన్ ఆఫీసు నుంచే పంపారు. సామాన్యుల్లోనూ ఇంత బిల్డప్ ఎందుకు అన్న చర్చే వవస్తుంది. వైసీపీని ముసుగులో సమర్థించే జర్నలిస్టులకు ఇవి పెద్ద ఆయుధం అయిపోయాయి. విపరీతంగా స్క్రీన్ షాట్లు తీసి.. ఏబీఎన్‌ను విమర్శించకుండా నేరుగా చంద్రబాబుపై తమ అక్కసు చూపించుకుంటున్నారు.

ఏబీఎన్‌కు తెలుగుదేశం మద్దతు చానల్ అనే పేరు ఉంది. కానీ ఎప్పుడూ వారు ఒప్పుకోరు. తాము అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఉంటామని చెబుతారు. కానీ చంద్రబాబుకు ఇస్తున్న అనవసర ఎలివేషన్లతో వారు వైసీపీకి మద్దతుగా మారిపోయారా అన్న అనుమానం చాలా మందికి కలుగుతోంది. ఏబీఎన్ వల్ల వైసీపీకే మేలు కలుగుతోంది కానీ టీడీపీకి కాదని.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

పై వాళ్లను ఆకట్టుకోవడానికి.. తామేదో టీడీపీ మద్దతుదారులం అని చెప్పుకోవడానికి చంద్రబాబు భక్తులం అని చెప్పుకోవడానికి సంస్థలో కొంత మంది ఇలాంటి తెలివి తేటలు ప్రదర్శిస్తూంటారు. వీరి తీరును అంచనా వేయలేని పై స్థాయి వారు.. ప్రోత్సహించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ అక్కడ యాజమాన్యానికి ఇవేమీ పట్టవు. థంబ్ నెయిల్స్.. వ్యూస్ .. ఇన్‌కం అనే ప్రపచంలో ఉంటారు. ప్రో టీడీపీ చానల్ ఇమేజ్‌తో వారు కావాల్సిన అడ్వాంటేజ్ సంపాదించుకుంటున్నారు. కానీ అసలు డ్యామేజ్ మాత్రం టీడీపీకి అవుతోంది.

విశేషం ఏమిటంటే… ఆ టైటిళ్లు పెట్టే వాళ్లకు అసలు సబ్జెక్ట్ ఉండదని.. కొన్ని సార్లు వాళ్లే బయట పెట్టుకుంటూ ఉంటారు. జరిగింది టీడీపీ ఆఫీస్‌పై దాడి అయితే.. రాష్ట్రపతి భవన్‌పై దాడి జరిగిందని ధంబ్నె యిల్స్ పెట్టేసి ఏబీఎన్ పరువును ఆన్‌లైన్‌లో పోగొట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close