హరీష్‌కు ఆహ్వానం లేదు.. కవిత వెళ్లలేదు !

టీఆర్ఎస్ ప్లీనరీలో అంతా కేటీఆర్ షో నడిచింది. బయట మొత్తం ఫ్లెక్సీలు కేసీఆర్‌వి ఉంటే.. లోపల హడావుడి మొత్తం కేటీఆర్‌దే. ప్లీనరీలో ఆయనకు ప్రమోషన్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. అందుకే విపక్షాలు అంతా ఆయ్యా – కొడుకు షోనేనా అని విమర్శలు చేస్తున్నారు. ఉద్యమకారులు.. హరీష్ రావు, కవిత వంటి వారు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చర్చనీయాంశం అవుతోంది.

హుజురుబాద్ ఉపఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న హరీష్ రావును ప్లీనరికీ రావొద్దని కేసీఆర్ చెప్పారు. అక్కడే ఉండి పనులు చూసుకోవాలన్నారు. దాంతో హరీష్ రావు హుజురాబాద్‌కే పరిమితమయ్యారు. కానీ కవితకు మాత్రం ఎమ్మెల్సీ హోదాలో ఆహ్వానం ఉంది . ఆమె కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను నిర్వహించి తిరిగి వచ్చారు. కానీ ఆమె మాత్రం హాజరు కాలేదు. జ్వరంగా ఉండి వెళ్లలేదని ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.

కొంత కాలంగా కవిత కుటుంబపరమైన కార్యక్రమాలకు.. ముఖ్యంగా కేటీఆర్‌తో ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. నమస్తే తెలంగాణలో ఆమెకు సరిగ్గా కవరేజీ కూడా రావడం లేదు. ఆమె హుజురాబాద్‌లోటీఆర్ఎస్ కోసం ప్రచారం చేసిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ కారణంగానే టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. కొన్ని అంశాల్లో సోదరుడు కేటీఆర్‌తో కవితకు సరిపడటం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close