3 పథకాలు – ఒకే మీట .. అకౌంట్లలో డబ్బులు వేయనున్న జగన్ !

ఏపీ ప్రభుత్వ నగదు బదిలీ పథకాల్లో భాగంగా అక్టోబర్ క్యాలెండ్‌లో ఉన్న పథకాలకు నేడు సీఎం జగన్ మీట నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. రైతుభరోసా పథకం కింద యాభై లక్షలకుపైబడిన రైతులకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. నాలుగు వేలు జమ చేయనున్నారు. ఇందు కోసం రూ.2,052 కోట్లు కేటాయించారు. నిజానికి ఈ నాలుగు వేలల్లో రెండు వేలు కేంద్రమే ఆగస్టులో ఇచ్చేసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున రెండు వేలు మాత్రమే అకౌంట్‌లో జమ అవుతాయి. కేంద్ర జాబితాలో ఏపీ నుంచి 30 లక్షల మంది రైతులు కూడా లేరు. మిగిలిన వారికి ఏపీ ప్రభుత్వం మొత్తం ఇస్తుందో లేదో క్లారిటీలేదు. అందుకే పీఎం కిసాన్ అనేరు రైతు భరోసాకు జోడించారు.

ఇక రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేసిన వారికి సున్నా వడ్డీ పథకం అమల్లో ఉంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తున్నారు. 2020 సీజన్‌కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులు ఇలా రుణాలు తీసుకుని చెల్లించినట్లుగా తేల్చి వారికి రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. నిజానికి మేనిఫెస్టోలో రైతులు ఎంత మొత్తం తీసుకున్నా సున్నా వడ్డీ అమలు చేస్తామని మొదటి అసెంబ్లీ భేటీలో జగన్ చెప్పారు. తీరా చూస్తే అది ఏడాదికి వంద కోట్ల వద్దనే ఉంటోంది. గత ప్రభుత్వం రూ. రెండు లక్షల వరకూ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తే జగన్ సర్కార్ రూ. లక్షకే పరిమితం చేసి అమలు చేస్తోంది.

మరో వైపు చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీని పాతిక కోట్లను నేడు సీఎం విడుదల చేనయున్నారు గ్రామస్థాయిలో 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించారు. యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలను సబ్సిడీపై ఇస్తున్నారు. రైతులు కమిటీలుగా ఏర్పడి సబ్సిడీ పొందుతున్నారు. ఈ సబ్సిడీ పాతిక కోట్లను రైతు గ్రూపులకు సీఎం జమ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close