అసాంఘిక శక్తులుగా వాలంటీర్లు.. బాలింతపైనే అత్యాచారయత్నం !

వాలంటీర్లు ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజలపై అఘాయిత్యాలకు పాల్పడటానికి తమకు అదే లైసెన్స్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకు వారి ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లు అనే గ్రామ వాలంటీర్ ఏకంగా బాలింతపైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ పథకానికి సంబంధించి వెరీఫికేషన్ అంటూ ఇంటికి వచ్చాడు. ఇంటి పెద్ద లేరని చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వచ్చికూర్చుని ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడుతున్నట్లుగా నటించి… ఆ బాలింతపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడ్నుంచి తప్పించుకుంది. తన భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

కేసు నమోదైనప్పుడు పట్టించుకోని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మీడియాలో హైలెట్ అయిన తర్వాత చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశించినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే నేరం చేసిన వాళ్లను మహిళా కమిషన్ చైర్మన్ ఆదేశించే వరకూ చర్యలు తీసుకోరా అన్నది అందరిక వచ్చే డౌట్. నిజానికి వాలంటీర్లు చేస్తున్న నేరాలపై ప్రతి రోజూ ఏదో ఓ చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతంలో నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్ అభం శుభం ఎరుగని.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలు చోట్ల లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.

వాలంటీర్లు తాము చట్టాలకు అతీతమని అనుకుంటున్నారో… అంతకు మించి ప్రభుత్వమే తాము అని ఫీలవుతున్నారో కానీ.. వారు చేస్తున్న నేరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పలు చోట్ల.. అత్యాచారాలు.. అత్యాచారయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ రవాణా దగ్గర్నుంచి పోలీసులపై దాడులకు పాల్పడటం వరకూ ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారుతున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నా పట్టించుకుంటున్న వారు లేరు. ప్రభుత్వం వారికి అవార్డులిచ్చి సన్మానాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close