8మంది హీరోయిన్ల‌తో చిరు సినిమా

చిరంజీవి `భోళా శంక‌ర్‌` ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. భోళా త‌ర‌వాత చిరు నుంచి రెండు ప్రాజెక్టులు రానున్నాయి. ఓ సినిమాకి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. మ‌రో దానికి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. `బింబిసార‌`తో సూప‌ర్ హిట్టు కొట్టాడు వ‌శిష్ట‌. ఈసారి చిరు సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేసే ఛాన్స్ వ‌చ్చింది. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో ఈ క‌థ రాసుకొన్నాడు వశిష్ట‌. ఈ సినిమాలో ఏకంగా 8మంది హీరోయిన్లు ఉంటార‌ని తెలుస్తోంది. అంద‌రివీ కీల‌క‌మైన పాత్ర‌లే. అందుకోసం ఇప్ప‌టి నుంచే క‌థానాయిక‌ల వేట మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. చిరు వ‌యసుకీ, క్రేజ్‌కీ, ఆయ‌న ఈజ్‌కీ స‌రిప‌డా హీరోయిన్ల లిస్టు ఒక‌టి త‌యార‌వుతోంది. ఇందులో స్టార్ హీరోయిన్లు ఉన్నారు. కొత్త‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లూ ఉన్నారు. ఆ స‌మ‌యానికి ఎవ‌రు అందుబాటులో ఉంటే… వాళ్ల‌ని ఎంపిక చేసుకొంటారు. క‌ల్యాణ్ కృష్ణ సినిమానీ, వ‌శిష్ట ప్రాజెక్ట్‌నీ ఒకేసారి ప‌ట్టాలెక్కించి, రెండు సినిమాల్నీ సమాంత‌రంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. వ‌శిష్ట క‌థ‌లో గ్రాఫిక్స్ హంగుల‌కు ప్రాధాన్యం ఉంది. ఆ సినిమా కాస్త ఆల‌స్యంగా విడుద‌ల కావొచ్చు. దానికంటే ముందు క‌ల్యాణ్ కృష్ణ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఈ సినిమాని సంక్రాంతి బ‌రిలో నిలిపే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా ?!

''74 సంవత్సరాలు ఉన్న ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం'' అన్నారు సీనియర్ నటుడు మురళీ మోహన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై కాస్త...

‘అన్నాయ్‌..’ ఆశ‌లు పోయినాయ్‌!

శ్రీ‌కాంత్ అడ్డాల డ్రీమ్ ప్రాజెక్ట్ `అన్నాయ్‌`. ఇద్ద‌రు స్టార్ హీరోలతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తీర్చిదిద్దాల‌న్న‌ది త‌న ప్ర‌య‌త్నం. క‌థ కూడా రెడీ. గీతా ఆర్ట్స్ లో ఈ క‌థ వినిపించారాయ‌న‌. కాక‌పోతే.. బ్ర‌హ్మోత్స‌వం...

అప్పుడు చెల్లాయి.. ఇప్పుడు అమ్మాయి

'వీరసింహరెడ్డి'లో సిస్టర్ ఎమోషన్ ని బలంగా నమ్మాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమాకి ప్రధాన ఆకర్షణగా వున్న పెద్ద బాలయ్య పాత్రని ఇంటర్వెల్ లోనే ముగించి చాలా పెద్ద సాహసమే చేశారు. ఈ...

మెగా 156.. ఆగని రూమర్స్

చిరంజీవి నుంచి ఒకేసారి రెండు సినిమా ప్రకటనలు వచ్చాయి. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి. మరొకటి మెగాడాటర్ సుస్మిత నిర్మించబోతున్న సినిమా. ఇది మెగాస్టార్ కి 156 చిత్రం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close