మ‌హేష్ కీ ‘బాహుబ‌లి’ ఫార్ములానే!

ఓ క‌థ‌ని రెండు భాగాలుగా విడ‌గొట్టి – డ‌బుల్ ప్రాఫిట్ పొంద‌డం ఎలానో బాహుబ‌లితో చూపించాడు రాజ‌మౌళి. ఆ త‌ర‌వాత పుష్ప కూడా అదే బాట‌లో న‌డిచింది. చాలా సినిమాలు ఇప్పుడు ఈ ఫార్ములా అనుస‌రిస్తున్నాయి. రాజ‌మౌళి మ‌రోసారి పార్ట్ 1, పార్ట్ 2 పంథాలోనే సినిమా తీస్తున్న‌ట్టు టాక్.

రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా మ‌హేష్‌తోనే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు శ‌ర వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమానీ రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. దీనిపై మ‌హేష్‌తో రాజ‌మౌళి వాడీ వేడీగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. రెండు భాగాలుగా తీసేంత స్ట‌ఫ్ ఈ క‌థ‌లో ఉంద‌ని, అలాంట‌ప్పుడు దాన్ని వ‌దులుకోకూడ‌ద‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. ఇలా రెండు భాగాలుగా తీయాల‌నుకొంటే.. మ‌రికొంత అద‌న‌పు స‌మ‌యం ఈ సినిమాకి కేటాయించాల్సి ఉంటుంది. రాజ‌మౌళి సినిమా అంటే క‌నీసం రెండేళ్ల కాల్షీట్లు ఇచ్చేయాలి. ఇప్పుడు పార్ట్ 2 కూడా అంటే – మ‌రో యేడాది పోయిన‌ట్టే. బాహుబ‌లి విష‌యంలో ఇదే జ‌రిగింది. అయినా స‌రే, దానికి త‌గిన ప్ర‌తిఫ‌లం వచ్చింది. రాజ‌మౌళి ఒక‌టి ఫిక్స‌య్యాడంటే.. అది జ‌రిగి తీరుతుంది. మ‌హేష్ కూడా రాజ‌మౌళి ఆలోచ‌న‌ల స‌ర‌ళికి అనుగుణంగా వ‌ర్క్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తుందా, రాదా? అనేది రాజ‌మౌళి తీసుకొనే ఫైన‌ల్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను ఓ పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి....

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close