ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రూపంలో వచ్చి ఓ సూపర్ హిట్ అందుకొన్నారు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే బాబి సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ఈలోగా ‘విశ్వంభర’ కు సంబంధించిన ఓ అప్ డేట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు.
గతేడాదే రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్ లేదా జులైలో ఈ సినిమా విడుదల ఖాయమన్నది అందరి మాట. అందుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వీఎఫ్ఎక్స్ పనులూ ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ ఉగాదిన ఓ విశ్వంభర నుంచి ఓ ట్రీట్ రాబోతోందని టాక్. విశ్వంభర రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్ డేట్ కూడా ఇస్తారని తెలుస్తోంది. జూన్, జులై కాబట్టి.. రిలీజ్ కి టైమ్ ఉంది. ఈలోగా పాటల్ని వదలాలి. ఓ ట్రైలర్ కూడా కట్ చేస్తున్నారు. ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయితే.. ఇక ‘విశ్వభర’కు అడ్డు లేనట్టే.
అన్నట్టు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సోమవారానికి 50 రోజుల్ని పూర్తి చేసుకొంది. 109 సెంటర్లలో అర్థ శతదినోత్సవం పోస్టర్ వేసుకొంది. ఈమధ్య కాలంలో ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడిన సినిమా లేదు. ఆ రకంగానూ ఈ సినిమా తన ప్రత్యేకత నిలుపుకొంది.
