రైతు ఆత్మహత్యల సబ్జెక్ట్‌తో 150వ చిత్రం, డబుల్‌రోల్‌లో చిరు

హైదరాబాద్: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చిరంజీవి 150వ చిత్రానికి కథ ఎట్టకేలకు ఖరారయింది. తమిళంలో హీరో విజయ్ హీరోగా గత ఏడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ‘కత్తి’ని చిరంజీవి ఎంచుకున్నారు.  తమిళంలో ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగులో వినాయక్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం మురుగదాస్ అందిస్తారు. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన రమణ చిత్రాన్ని తెలుగులో వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవటం విశేషం.

ఈ చిత్రాన్ని చిరుతనయుడు రాంచరణే నిర్మిస్తున్నారు. రేపు బ్రూస్‌లీ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించబోతున్నారు. వచ్చేనెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 22న తమిళంలో విడుదలైన ‘కత్తి’ చిత్రం రైతుల ఆత్మహత్యల కథాంశంతో రూపొందింది. విజయ్ రెండు పాత్రలలో నటించారు. సమంత హీరోయిన్‌గా నటించింది.

మరోవైపు ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం అంటే చిరంజీవి దర్శకత్వం చేసినట్లే అనే వాదనలు వినబడుతున్నాయి. ఇంతకుముందు తన సినిమాలలో, ఇప్పుడు చరణ్ సినిమాలు చాలావాటిలో చిరంజీవి వివరీతంగా జోక్యం చేసుకుంటారన్నది టాలీవుడ్‌లో అందరికీ తెలిసిన విషయమే. అలా జోక్యం చేసుకోవటంవలన చాలా సినిమాలు ఫ్లాప్‌కూడా అయ్యాయి. మురుగదాస్ తెలుగులో దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ దీనికి ఒక ఉదాహరణగా చెబుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి 9 మంది ఎమ్మెల్యేలు..?

మేము గేట్లు ఓపెన్ చేస్తే చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అంటూ ఆ మధ్య సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ...

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close