ట్రైలర్ టాక్ : ‘భోళా’ ఫ్యాన్స్ స్పెషల్

భోళా శంకర్ తో ఆగస్ట్ బరిలో దిగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు పాటలు, టీజర్ బయటికి వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ ని కూడా బయటికి వదిలారు. మెగా అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేట్లు ఈ ట్రైలర్ ని కట్ చేశారు. ట్రైలర్ కట్ చేయడంలో కొత్తదనం కనిపించలేదు లేదు కానీ చిరంజీవి గత చిత్రాలని, ఆయన స్టయిల్, గ్రేస్, స్వాగ్ ని ప్రజంట్ చేస్తూ ట్రైలర్ సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లారు.

చిరంజీవితో పాటు సినిమాలోని దాదాపు ప్రముఖ తారాగణం అంతా ట్రైలర్ లో కనిపించింది. తమన్నా, సుశాంత్ లకి కి డైలాగులు కూడా దక్కాయి. చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ఐతే హీరో, విలన్ మధ్య సంఘర్షణ రొటీన్ వ్యవహారమని ట్రైలర్ లోనే అర్ధమైపోతుంది.

భారీ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ట్రైలర్ లో చూపించారు. అలాగే చిరంజీవి పాత్రలోని ఫన్ కూడా ట్రైలర్ లో ఎలివేట్ చేశారు. యాప్లిస్ కాయ, బోలో జీ .. లాంటి డైలాగ్స్ చిరు ట్రేడ్ వింటేజ్ మార్క్ ని గుర్తుకు తెచ్చాయి. ట్రైలర్ చివర్లో చిరు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసిన మేనరిజం మాత్రం మెగా అభిమానులకు తెగ నచ్చేస్తుంది. ఆగస్ట్ 11న సినిమా ప్రేక్షకులకు ముందు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.