మెగా లుక్‌: గాడ్ ఫాద‌ర్ ఆగ‌మనం

మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యాన్ని అందుకొన్న చిత్రం… లూసీఫ‌ర్‌. తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సింహాస‌నం లాంటి కుర్చీపై చిరంజీవి ఠీవీగా కూర్చున్న స్టిల్ ఇది. కూలింగ్ గ్లాస్‌, గ‌డ్డం, దీర్ఘాలోచ‌న‌లో ఉన్న చిరు.. కాలు మీద కాలేసుకొని స్టైలీష్ గా రివీల్ అయ్యారు. చిరు హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫ‌రెంట్ గానే క‌నిపిస్తోంది. ఆచార్య త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది. ఆ ఫ్లాప్ తో చిరు అభిమానులు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్లంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాలంటే.. చిరు హిట్ కొట్టాల్సిందే. చిరు చేతిలో చాలా సినిమాలున్నా… ఆయ‌న `గాడ్ ఫాద‌ర్‌`పైనే ఎక్కువ న‌మ్మ‌కాలు పెట్టుకొన్నారు. అందుకే ఈ సినిమాని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. స‌ల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీల‌కమైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్, చిరుల‌పై ఓ మాస్ పాట తెర‌కెక్కించాల్సివుంది. అది తీస్తే… సినిమా దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. న‌య‌న‌తార క‌థానాయిక‌. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ కాస్టింగ్ మాత్రం బ‌లంగా ఉంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.