రఘురామ ఢిల్లీ పలుకుబడి జీరో – పీఎంవో కూడా పట్టించుకోలేదేంటి ?

హాయ్ రాజు గారూ ! అని ప్రధాని మోదీ పిలిచారని గొప్పగా చెప్పుకున్నారు. అయిన దానికి కాని దానికి ప్రధానిని అభినందించారు. హిందూత్వం అంటూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. తాను అడగాలే గానీ అందరూ అపాయింట్‌మెంట్లు ఇస్తారని చెప్పుకున్నారు. తీరా చూస్తే..తన నియోజకవర్గంలో తాను ఎంపీగా ఉండి కూడా.. తన పేరును ప్రోటోకాల్ జాబితాలో పెట్టించుకోలేకపోయారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టింది కాబట్టి.. అధికారం రాష్ట్రం చేతుల్లో ఉంటుంది కాబట్టి ఏపీలో ప్రోటోకాల్ ఇవ్వలేదు అంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ జాబితాలో ఎంపీ పేరు లేకపోవడం ఖచ్చితంగా రఘురామకు అవమానమే. ఎంపీ పదవికి కూడా తీవ్రమైన అవమానమే. కేంద్ర పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ చెప్పుకుంటూ ఉంటారు.

కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నట్లుగా ఇంత కాలం కవరింగ్

జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తూంటారు. పలు సందర్భాల్లో సమయం రాగానే కేంద్ర ప్రభుత్వం మీ సంగతి తేలుస్తుదంని చెబుతూ ఉంటారు. అయితే అవన్నీ పైపా మాటలేనని తాజా ఘటనతో తేలిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన జాబితాలో రఘురామ పేరు లేరు. ఈ విషయంలో రఘురామ ప్రధానమంత్రి కార్యాలయాన్ని వేడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే … ప్రోటోకాల్ ప్రకారం ఓ లెక్క ఉంటుంది. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వెళ్తే ఆయనకు స్వాగతం చెప్పే కార్యక్రమాల్లో కానీ.. ఇతర ప్రోగ్రామ్స్ విషయాల్లో కానీ.. మొదట గవర్నర్ .. తర్వాత సీఎం తర్వాత మంత్రులు..ఆ తర్వాత ఎంపీలు ఉంటారు.

ప్రోటోకాల్ ప్రకారం పెట్టాల్సిన పేరు పెట్టకుండా ముంచేసిన పీఎంవో

పార్టీలతో సంబంధం లేకుండా అందరి పేర్లు ఉండాలి. ఉంటాయి కూడా. కానీ ప్రధాని భీమవరం పర్యటనకు వచ్చే సరికి ఎంపీ పేరు కనిపించకుండా పోయింది. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో ఎంపీ పేరు లేకపోవడంతో రఘురామ కూడా షాకయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం పెట్టాల్సిన పేరు ఎందుకు పెట్టలేదని ఆయన అడగలేకపోయారు. దీంతో ఢిల్లీలో ఆయన పలుకుబడి శూన్యమని తేలిపోయిందన్న సెటైర్లు పడుతున్నాయి. తాను అడిగితే ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తారని.. తనకు ప్రధాని కాక ముందు నుంచే మోదీతో పరిచయం ఉందని రఘురామ చెబుతూ ఉంటారు.

వైసీపీ కోసం రూల్స్ ను కూడా పీఎంవో పట్టించుకోకపోవడంపై రఘురామ విస్మయం

ఇప్పుడువన్నీ తెలిపోయాయి. వైసీపీపై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తారని ఇప్పటి వరకూ గుడ్డిగా రఘురామ నమ్ముతూ వచ్చారు.కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని.. వైసీపీని మెప్పించడానికి సాక్షాత్తూ పీఎంవో కూడా రూల్స్ బ్రేక్ చేస్తుందని ప్రత్యక్షంగా తెలియడంతో రఘురామ ఓ రకంగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయంలో తెర వెనుక జరిగిందో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏదైనా మొత్తానికి పీఎంవోనే ఈ సారి రఘురామకు షాకిచ్చింది. తన సొంత నియోజకవర్గంలోనూ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం తెప్పించుకోలేకపోయిన దుస్థితికి పడిపోయింది. దీంతో ఇప్పటి వరకూ ఆయన చెబుతున్న మాటలన్న తేలిపోయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close