చిరుకి క‌లిసొచ్చిన రీమేక్‌!

ఆచార్య‌తో చిరంజీవి ఫ్యాన్స్ దారుణంగా డీలా ప‌డిపోయారు. అన్ని వైపుల నుంచీ విమ‌ర్శ‌లే. ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశ‌కు గురి చేశాయి. చిరంజీవి ఇక రిటైర్ అయిపోవొచ్చేమో..? అనేంత‌గా భ‌య‌పెట్టాయి. అయితే… చిరు `గాడ్‌ఫాద‌ర్‌`తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకొన్నారు. ఈ సినిమాలో చిరు పెర్‌ఫార్మ్సెన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, ఈ సినిమాకి వ‌స్తున్న స్పంద‌న‌, వ‌సూళ్లు.. ఇలా… అన్ని విధాలుగానూ అభిమానుల‌కు ఊపిరి పోశాయి.

నిజానికి లూసీఫ‌ర్ రీమేక్ అన‌గానే ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ ప‌డిపోయారు. లూసీఫ‌ర్ చిరంజీవి టైపు సినిమా కాదు క‌దా, అని భ‌య‌ప‌డ్డారు. ఇందులో పాట‌ల్లేవు, చిరు సినిమాల్లో రొటీన్ గా క‌నిపించే కామెడీ, రొమాన్స్ ఏమీ లేవు. అవి లేకుండా కూడా చిరు మెప్పించ‌గ‌ల‌డు… అని గాడ్ ఫాద‌ర్ నిరూపించింది. చిరు వ‌య‌సు పైబ‌డింది. ఇప్పుడు కూడా డాన్సులు, రొమాన్సుల‌తోనే అభిమానుల్ని మెప్పించాలని అనుకోవ‌డం అత్యాసే. చిరు రూటు మార్చాల్సిన వేళ‌.. గాడ్ ఫాద‌ర్ ఓ పునాది రాయిగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చిరుకి రీమేకులు బాగా క‌లిసొచ్చాయి. ఆయ‌న రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150 కూడా రీమేకే. తొమ్మిదేళ్ల త‌ర‌వాత చిరంజీవి సినిమా చేసినా – అభిమానులు మ‌ళ్లీ అక్కున చేర్చుకొని భారీ వ‌సూళ్లు అందించారు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన సైరా, ఆచార్య‌… రెండూ వ‌ర్జిన‌ల్ క‌థ‌లు. రెండూ నిరాశ క‌లిగించిన త‌రుణంలో మ‌రో రీమేక్ చిరు కెరీర్‌కి ఊపిరిపోసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close