సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌… మ‌హేష్‌?!

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల ఓ షెడ్యూల్ కూడా అయ్యింది. ఆ షెడ్యూల్ లో భారీ యాక్ష‌న్ పార్ట్ తెర‌కెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో మ‌హేష్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌హేష్ ఈ త‌ర‌హా పాత్ర పోషించ‌డం ఇదే తొలిసారి. ఈనెల 15 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఈ షెడ్యూల్ లో పూర్తిగా కుటుంబ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇదే షెడ్యూల్ లో పూజా కూడా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇది వ‌ర‌కు అత‌డు, ఖ‌లేజా… వ‌చ్చాయి. ఈ చిత్రం కోసం ఆల్రెడీ ఓ టైటిల్ లాక్ చేశారు. అదేమిటో అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close