మెగాస్టార్ చిరంజీవి .. కళా తపస్వి కె.విశ్వనాథ్‌ను కలిశారు. పండుగ రోజు హఠాత్తుగా హైదరాబాద్‌లోని విశ్వనాథ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన చిరంజీవి.. వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. వారితో కలిసి ఉల్లాసంగా గడిపారు. విశ్వనాథ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పండుగరోజు మర్యాద పూర్వకంగా కలిశానని .. తనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన విశ్వనాథ్‌ను కలవడం సంతోషంగా ఉందని చిరంజీవి ఆనందపడ్డారు. ఇటీవల కరోనా వచ్చిందనుకుని నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ అయిన మెగాస్టార్‌కు .. ఆ తర్వాత తనకు అసలు కరోనా సోకలేదని గుర్తించారు.
హోం క్వారంటైన్ సందర్భంగా మానసికంగా చాలా ఆవేదనకు గురైనట్లుగా చిరంజీవి.. ఓ ఎమోషనల్ పోస్టులో చెప్పారు. కాలం, కరోనా తనతో ఆడేసుకున్నాయన్నారు. కరోనా సోకిన వారి మానసిక స్థితి చాలా ఆందోళన కరంగా ఉంటోంది. బయట జరుగుతున్న ప్రచారం.. అంతకు మించి ఉంటోంది. దీంతో పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో పరిపరి విధాల ఆలోచనలు మనసుల్ని తొలుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని చిరంజీవి కూడా అనుభవించినట్లుగా తెలుస్తోంది.
కోలుకున్న తర్వాత… అందర్నీ ఓ సారి కలిసి.. ాత స్మృతులు నెమరు వేసుకోవాలని ఆయన భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన హఠాత్తుగా విశ్వనాథ్ ఇంటికి వెళ్లినట్లుగా అంచనా వేస్తున్నారు. కేసీఆర్‌తో మీటింగ్ సమయంలో ఎలాంటి మాస్క్‌లు పెట్టుకోని మెగాస్టార్.. విశ్వనాథ్ ఇంటికి వెళ్లినప్పుడు మాత్రం పూర్తి కరోనా నిబంధనలు పాటించారు. మాస్క్‌తో వెళ్లారు.