టీజ‌ర్ వ‌ద్ద‌న్న చిరు?

చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈనెల 22న త‌న కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల అవుతున్నాయి. నిజానికి కొర‌టాల శివ ఇంకాస్త ఎక్కువ‌గానే ప్లాన్ చేసిన‌ట్టు టాక్‌. బాల‌య్య పుట్టిన రోజున బోయ‌పాటి వ‌దిలిన‌ట్టు.. ఓ చిన్న డైలాగ్ తో టీజ‌ర్‌ని వ‌ద‌లాల‌ని భావించాడ‌ట‌. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా రెడీ చేసి, ర‌ఫ్ క‌ట్ కూడా చేసి పెట్టాడ‌ట‌. కానీ.. చిరంజీవి మాత్రం సున్నితంగా `నో` చెప్పిన‌ట్టు టాక్‌.

ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి వివ‌రాలూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. క‌నీసం టైటిల్ కూడా చెప్ప‌లేదు. టైటిల్ తో పాటు, ఫ‌స్ట్ లుక్ నీ ఒకేసారి విడుద‌ల చేసి. ఆ త‌ర‌వాత‌.. చిన్న టీజ‌ర్ వ‌ద‌లాల‌న్న‌ది చిరు ప్లాన్‌. అన్నీ ఒకేసారి అయితే ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ని భావించార్ట‌. వినాయ‌క చ‌వితి, దీపావ‌ళి.. ఇలా రాను రాను చాలా ప్ర‌త్యేక సంద‌ర్భాలున్నాయి. అప్పుడు టీజ‌ర్ వ‌దిలితే బాగుంటుంద‌ని చిరు ఉద్దేశం. అందుకే.. కొర‌టాల డైలాగ్ టీజ‌ర్ క‌ట్ చేసినా, చిరు నో చెప్పాడ‌ట‌. ఈసారికి ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ లోగోతో స‌రిపెట్టుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను...

బీజేపీ శర్మ గారి జైలు జోస్యం నిజమే..! కాకపోతే రివర్స్‌లో..!

గుజరాత్‌లోని సూరత్‌లో పీవీఎస్ శర్మ అనే మాజీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్, బీజేపీ నేత, ప్రస్తుతం మీడియా కంపెనీ ఓనర్‌ను.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమాలు.. అవినీతికి పాల్పడిన చాలా మందిని...

HOT NEWS

[X] Close
[X] Close