ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ ల‌ను నిర్మించే ప‌నిలో ఉంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల ఓ వెబ్ సిరీస్ కి శ్రీ‌కారం చుట్టింది. ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్ కి ద‌ర్శ‌కుడు. ఓయ్‌తో.. ప‌రిచ‌మ‌య్యాడు ఆనంద్ రంగ‌. ఆ త‌ర‌వాత‌.. టాలీవుడ్ లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఇప్పుడు ఓ స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అది వెబ్ సిరీస్ కి అనువుగా ఉండ‌డంతో.. సుస్మిత ప్రొడ‌క్ష‌న్ లో దీన్ని ప‌ట్టాలెక్కించారు. ఇదో థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ల‌లో విజ‌య‌వంత‌మైన జోన‌ర్ ఇది. అయితే తెలుగులో మంచి థ్రిల్ల‌ర్లు రావ‌డం లేదు. ఆ లోటుని తీర్చేలా.. ఈ వెబ్ సిరీస్‌ రూపొందుతోంద‌ట‌. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయ‌ని ఒక్కోక్క ఎపిసోడ్ నిడివి 30 నుంచి 40 నిమిషాల లోపు ఉంటుంద‌ని తెలుస్తోంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close