కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్ దొరక్క ఏళ్లతరబడి అవకాశాలకోసం ప్రయత్నిస్తూనే ఉండే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆశాకిరణంలా గా కనిపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఇటీవలి కాలంలో సొంత యాప్ లో సినిమాలు విడుదల చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఒకసారి చూడడానికి వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు అంటూ ఛార్జ్ పెట్టి ఆయన తీస్తూన్న సినిమాల్లో కంటెంట్ మరీ నాసిరకంగా ఉంటోంది అన్న విమర్శలు ఉన్నప్పటికీ, ఆ తరహా చిత్రాలకు కూడా ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో రామ్ గోపాల్ వర్మ అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలు కమర్షియల్ గా పాసై పోతున్నాయి. పైగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలకు తనదైన శైలిలో పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ ఉండడం, అదీకాక ఈ సినిమాలో హీరోయిన్లని వారి అందాలని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉండడంతో, ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లకు అమాంతం గుర్తింపు లభిస్తుంది.

ఏళ్ల తరబడి కష్టపడినా రాని గుర్తింపు రెండు రోజుల్లో సంపాదించుకున్న రాపాక:

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నా రాని గుర్తింపు, నగ్నం అన్న ఒక్క రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించడం తో వచ్చింది రాపాక అనే యువతికి. కేవలం రెండంటే రెండు రోజుల పాటు ఆవిడ ఈ సినిమా కోసం పని చేసింది. 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా లో ఆవిడకు సంబంధించిన సీన్లన్నీ ఆ రెండు రోజుల్లోనే తీసేశారు. రెమ్యూనరేషన్ కూడా రోజుకు లక్ష రూపాయల చొప్పున రెండు లక్షల దాకా ఇచ్చారని సమాచారం. మిగిలిన సినిమానీ కూడా ఇలాగే రోజుల వ్యవధిలో చుట్టేసి యాప్ లో విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. కంటెంట్ లేదని, అసలు రెండు వందలు పెట్టి చూడడానికి ఇందులో ఏమీ లేదని ఎందరు ఎన్ని విమర్శలు చేసినా, ఆవిడ హాట్ ఫోటోలను చూసి ఈ సినిమా టికెట్ కొన్న వారు చాలా మందే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఆవిడ సెలబ్రిటీ అయిపోయింది. పలు టీవీ ఛానల్స్ లో , సోషల్ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ మరిన్ని సినిమాలలో నటించడానికి ప్రయత్నిస్తోంది. మళ్లీ రాంగోపాల్ వర్మ తో పని చేయడానికి సిద్ధం అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా పెట్టింది.

7 గంటల్లో 15 వేల ఫాలోయర్స్ ను పొందిన అప్సరా రాణి:

ఇప్పుడు తాజాగా థ్రిల్లర్ అనే మరొక సినిమా తీస్తున్నాడు రాంగోపాల్ వర్మ. దీని కోసం అప్సర రాణి అనే ఒరిస్సాకు చెందిన యువతిని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆవిడ హాట్ ఫోటోలను, ఆవిడ తనతో చనువుగా ఉన్న ఫోటోలను, తన ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ తన తాజా సినిమాలో హీరోయిన్ ఈవిడే అంటూ ప్రకటించేశాడు రాంగోపాల్ వర్మ. ఆవిడ పేరు అప్సర రాణి కాదు అని, ఆవిడ అసలు పేరు అంకిత మహారాణా అని కొందరు రామ్ గోపాల్ వర్మ జిమ్మిక్కులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఏడు గంటల వ్యవధిలోనే ఆవిడ ఫాలోవర్ ల సంఖ్య నాలుగు వేల నుండి 15 వేలకు చేరింది. ఆమె కూడా ఆ రోజంతా, అమాంతం పెరుగుతున్న తన ఫాలోవర్ ల లిస్టు చూసుకుంటూ సంబరపడిపోతూ, అర్ధరాత్రి వరకు పోస్టులు చేస్తూనే ఉంది.

మరింత మంది వర్ధమాన తారలు రామ్ గోపాల్ వర్మ కోసం క్యూ లో:

ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్నా రాని గుర్తింపు, రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమాల ద్వారా రెండు మూడు రోజుల్లోనే వస్తుండడంతో, రెమ్యూనరేషన్ గా ముట్టేది తక్కువే అయినప్పటికీ, ఆ సినిమాలు ధియేటర్ లలో రిలీజ్ కావు అని తెలిసినప్పటికీ కూడా, అనేక మంది హీరోయిన్లు రామ్ గోపాల్ వర్మ తీయనున్న సినిమాలలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదీ కాక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ మొత్తం స్తబ్దుగా ఉండి, థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఉండడంతో, వర్ధమాన హీరోయిన్లు రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారానికో సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ, వీరిలో ఎంత మందికి బ్రేక్ ఇస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా...

విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు...

జగన్ జైలుకుపోతే షర్మిలే సీఎం !

తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి...

జగన్‌కు “అప్పు రత్న” బిరుదిచ్చిన పవన్ !

సీఎం జగన్ చేస్తున్న అప్పులపై జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close