‘గ్యాంగ్ లీడ‌ర్’ రిఫ‌రెన్సులు ఉన్నాయా?

చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్‌లో ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఒక‌టి. ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని చిరు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే ఆ టైటిల్ ఇప్పుడు నాని ప‌ట్టుకెళ్లిపోయాడు. నాని – విక్ర‌మ్ కె.కుమార్ కాంబోలో ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ త‌యారై.. విడుద‌ల‌కు కాచుకుని కూర్చుంది. వ‌చ్చేనెల 13న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఆ గ్యాంగ్ లీడ‌ర్‌కీ, ఈ గ్యాంగ్ లీడ‌ర్‌కీ ఏమాత్రం సంబంధం లేదు. కాక‌పోతే… ఆ సినిమా తాలుకూ కొన్ని రిఫరెన్సులు ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాయి. ఈ విష‌యాన్ని నాని సైతం ఒప్పుకున్నాడు. ‘గ్యాంగ్ లీడ‌ర్ షాట్ ఒక‌టి.. ఈ సినిమాలో వాడాం. గ్యాంగ్ లీడ‌ర్ అభిమానులు ఆ షాట్ బాగా న‌చ్చుతుంది. అయితే అది కేవ‌లం వాడాల‌ని వాడిన షాట్ కాదు.. క‌థ‌కి అవ‌సరం కూడా’ అన్నాడు నాని. అప్ప‌ట్లో గ్యాంగ్ లీడ‌ర్ ష‌ర్టులు చాలా ఫ్యామ‌స్ అయ్యాయి. పూల చొక్కాల‌కు డిమాండ్ వ‌చ్చింది. ఈ సినిమాలోనూ నాని ష‌ర్టుల‌న్నీ ఒకే థీమ్ ప్ర‌కారం డిజైన్ చేసిన‌వే. అన్న‌ట్టు.. నాని, అనిరుథ్ క‌లిసి ఓ ప్ర‌మోష‌న్ సాంగ్ చేశారు. అందులోనూ గ్యాంగ్ లీడ‌ర్ రిఫ‌రెన్స్ క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com