సచివాలయం ఎఫెక్ట్..! తెలంగాణ పాలనంతా “వర్క్ ఫ్రం హోం”..!

తెలంగాణ సీనియర్ అధికారులంతా.. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. సచివాలయానికి రాక ఏళ్లు గడిచిపోయాయి. తాను ఎక్కడ ఉంటే..అదే సచివాలయమని.. ఆయన చెబుతూ ఉంటారు. చీఫ్ మినిస్టర్ అంటే ఓ వ్యవస్థ కాబట్టి.. అది నిజమే అనుకున్నా.. అసలు సెక్రటేరియట్ అంటూ ఒకటి ఉండాలి కదా.. ఆ సెక్రటేరియట్ ఎక్కడో.. నిన్నామొన్నటిదాకా అందరికీ తెలుసు. ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో క్లారిటీ ఉంది. కానీ ఈ రోజు.. అసలు సెక్రటేరియట్ ఎక్కడ ఉంది..? కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త సచివాలయమంటూ… ప్రకటించిన బీఆర్కే భవన్‌లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్ తరలింపు నత్త నడకన సాగుతోంది. తరలింపు మొదలై 15 రోజులు దాటింది. కానీ ఇద్దరు అధికారులు మినహా మరెవ్వరూ అక్కడి నుండి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. పది రోజులుగా చీఫ్ సెక్రటరీ ఇంటి నుండే పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ్ ఉత్సవాలపై సమీక్షను పాత సెక్రటేరియట్‌లోనే నిర్వహించారు. చాలా శాఖల అధికారులు ఇంకా కూల్చేయాలనుకుంటున్న సెక్రటేరియట్ లొనే తిరుగుతున్నారు. ఫైళ్లన్నీ ప్యాక్ చేసేయడంతో… ఏ పనీ జరగడం లేదు. ఓ రకంగా పాలన స్తంభించింది.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బేగంపేట లోని మెట్రో రైలు భవనానికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. అలా చేయాలంటే.. మెట్రో రైల్ ఆఫీసును తరలించాలి. ఇప్పుడా పని చేస్తున్నారు. మంత్రులు, వారి పేషీలు కూడా ఇంకా కదలలేదు. గతంలో వివిధ రకాల పనుల నిమిత్తం.. పెద్ద ఎత్తున సందర్శకులు సెక్రటేరియట్‌కు వచ్చేవారు. తరలింపు.. విషయం తెలియక.. ఇప్పటికీ.. కొంత మంది వస్తున్నారు. కానీ.. వారికి.. పరిస్థితేమిటో అర్థం కావడం లేదు. అసలు సెక్రటేరియట్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి. అందుకే.. గొణుక్కుంటూ వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close