చిరు గుండు … అర‌వింద్ కోస‌మేనా?

చిరంజీవి కొత్త లుక్ టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎప్పుడూ లేనిది చిరు గుండు ఎందుకు చేయించుకున్నారు? అన్న‌ది అంద‌రిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌. ఈ లుక్ కొత్త పాత్ర కోస‌మే అంటూ.. చిరు పీఆర్ స్ప‌ష్టం చేసింది. అది.. మెహ‌ర్ ర‌మేష్ సినిమా కోస‌మా? బాబి సినిమా కోసమా? వినాయ‌క్ సినిమా కోస‌మా? అంటూ.. ఆరాలు తీయ‌డం మొద‌లెట్టారు మెగా అభిమానులు.

అయితే.. ఈ గుండు వెనుక‌.. అల్లు అర‌వింద్ ఉన్నార‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. `ఆహా` కోసం చిరుతో ఓ వెబ్ సిరీస్ చేయించాల‌ని అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చిరు కోసం కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేశారు. ఇటీవ‌ల బెంగ‌ళూరు వెళ్లిన చిరు, ఖాళీ స‌మ‌యంలో కొన్ని క‌థ‌ల్ని విన్నారని స‌మాచారం. అక్క‌డే.. గెట‌ప్పులూ ట్రై చేశార్ట‌. ఆ గెట‌ప్పుల్లో ఈ గుండు ఒక‌ట‌ని తెలుస్తోంది. `ఆహా` కోసం చిరు ఓ వెబ్ సిరీస్ చేస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం సాగుతోంది. ఈ విష‌యాన్ని అర‌వింద్ కూడా ధృవీక‌రించారు. చిరు ఎలాంటి ప్ర‌యోగాలు చేయాల‌న్నా.. అది ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వెబ్ సిరీస్ తోనే సాధ్యం. చిరు కూడా.. త‌న సత్తాని ప‌రీక్ష పెట్టి, త‌న‌ని కొత్త గా చూపించే క‌థ‌ల కోసం వెదుకుతున్నారు. `లూసీఫ‌ర్‌`, `వేదాళం` రీమేకులు చిరు చేతుల్లో ఉన్నాయి. ఈ రెండింటిలోనూ గుండుతో సంబంధం లేని పాత్ర‌లే. కాబ‌ట్టి…. చిరు ప్ర‌యోగం వెబ్ సిరీస్‌కోస‌మే అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close