‘ఆదిపురుష్‌’లో కృష్ణంరాజు?

రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటున్నారా? అది కూడా ప్ర‌భాస్ సినిమాతోనేనా? ఆ అవ‌కాశాలు ఉన్నాయని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `ఆదిపురుష్‌`లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో కృష్ణంరాజు న‌టించ‌బోతున్నార‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. ఓం రౌత్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. కొద్ది రోజుల క్రితం అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అప్ప‌టి నుంచీ ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఓ అప్ డేట్ వ‌స్తూనే ఉంది. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకున్నారు. మ‌రి కొన్ని కీల‌క‌మైన పాత్ర‌ల‌కు సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కృష్ణంరాజుకి ఓ పాత్ర ద‌క్కిన‌ట్టు లేటెస్ట్ వార్త‌. అయితే ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం ధృవీక‌రించాల్సివుంది.

కృష్ణంరాజు కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. `రెబ‌ల్‌`లో ఓ కీల‌క పాత్ర పోషించారు. `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం`లోనూ న‌టించారు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోబోతున్నారు. 2021 ప్ర‌ధ‌మార్థంలోనే `ఆదిపురుష్‌` ప‌ట్టాలెక్క‌బోతోంది. సీత పాత్ర లో ఎవ‌రు న‌టిస్తార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్‌, కైరా అడ్వానీ, అనుష్క శ‌ర్మ‌.. ఇలా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close