తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కు ఎదురైన పరాభవం కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాజీ మంత్రి రోజా పై జరుగుతున్న ట్రోలింగ్ హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఎక్కడ అడుగుపెట్టి ప్రచారం చేస్తే అక్కడ పార్టీలు సర్వనాశనం అయిపోతాయనే ఐరన్ లెగ్ ముద్రను నెటిజన్లు మరోసారి తెరపైకి తెచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత, ఆమె తన ప్రభావం చూపడానికి పక్క రాష్ట్రం తమిళనాడును ఎంచుకోవడం, అక్కడ డీఎంకేకు ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
నెటిజన్లు సెటైర్లు వేస్తున్నట్లుగా, డీఎంకే ఇప్పుడు కేవలం మూడో స్థానానికి పడిపోవడమే కాకుండా, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఆంధ్రాను ఖాళీ చేసి వచ్చారు.. ఇప్పుడు తమిళనాడులో డీఎంకేను కూడా క్లీన్ స్వీప్ చేయించేశారు అంటూ మీమ్స్ వర్షం కురుస్తోంది. ఎన్నికలకు ముందు ఆమె డీఎంకే మహిళా పథకాలను పొగుడుతూ చేసిన వీడియోలు ఇప్పుడు ఆమెకే రివర్స్ అవుతున్నాయి.
రోజాను స్టార్ క్యాంపెయినర్ గా డీఎంకే ఆహ్వానించినప్పుడు సోషల్ మీడియాలో అప్పుడే హెచ్చరికలు వచ్చాయి. డీఎంకే వారికీ టైమ్ దగ్గరపడింది అని అప్పట్లో వచ్చిన ట్రోల్స్ ఇప్పుడు నిజమయ్యాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. విజయ్ టీవీకే ప్రభంజనం ఒకవైపు ఉంటే, రోజా ప్రచారం మరోవైపు డీఎంకేకు శాపం లా మారిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పాపం.. డీఎంకే శ్రేణులు ఇప్పుడు స్టాలిన్ కంటే రోజానే ఎక్కువగా తిట్టుకుంటున్నారేమో అనే రేంజ్లో సెటైర్లు పేలుతున్నాయి.
మొత్తానికి రోజా రాజకీయంగా ఎక్కడ ప్రచారం చేసినా అది ప్రత్యర్థి పార్టీకి వరప్రసాదం లా మారుతుందనే నమ్మకం సోషల్ మీడియాలో గట్టిగా నాటుకుపోయింది. ఏపీలో పరాజయం తర్వాత ఆమెకు ఇక్కడైనా గుర్తింపు వస్తుందని భావించినా, అది కాస్తా డీఎంకే పతనంతో డబుల్ షాక్ గా మారింది.
