టీడీపీ ఆఫీసులో దొరికింది “సీఐ”నే..కాకపోతే రివర్స్ కేసులు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సమయంలో ఒకరిని టీడీపీ నేతలు పట్టుకున్నారు. అతన్ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్నానని అతను చెబుతున్నారని.. అల్లరి మూకలతో కలిసి ఆయన ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆయన నిజంగా డీజీపీ ఆఫీసులో పని చేస్తూ ఉంటే అది స్టేట్ స్పాన్సర్డ్ దాడులేనని అశోక్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ వంటి వారు స్పష్టంచేశారు. తర్వాత ఆయనను తీసుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి.. దాడుల్లో పాల్గొన్న వ్యక్తిగా ఫిర్యాదు ఇచ్చారు.

అయితే టీడీపీ ఆఫీసులో సివిల్ డ్రెస్‌లో ఉండి.. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని ఆ వ్యక్తి నిజంగానే డీజీపీ ఆఫీసులో పని చేస్తున్నారని గుర్తించారు. ఆయన పేరు నాయక్ అని తేలింది. అదీ కూడా పోలీసులు టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఐ నాయక్‌పై దాడి చేశారని పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోనే తెలిసింది. నారా లోకేషన్‌ను ఈ కేసులో ఎ-వన్‌గా చేర్చారు. ఏ-2గా అశోక్ బాబు, ఏ -3గా ఆలపాటి రాజాను పేర్కొన్నారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై రెండు వందల మంది దాడి చేసినా.. ఓ డీఎస్పీ, మరో పోలీసు మాత్రమే వచ్చారని .. కనీస భద్రత కూడా కల్పించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అనూహ్యంగా సివిల్ డ్రెస్‌లో ఎలాంటి ఐడీ కార్డు కూడా లేకుండా సీఐ తమ ఆఫీసులో ఉండటం.. విధ్వంసం జరుగుతున్నప్పుడు అతను కూడా అక్కడే ఉండటాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులతో కలిసే వైసీపీ నేతలు దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలతో పాటు సీఐ వచ్చారని ఆరోపిస్తూ.. తమకు దొరికిన వ్యక్తిని మీడియా ముందు వ్యక్తిని ప్రవేశ పెట్టడం.. అతను నిజంగానే పోలీసుగా తేలడం.. రివర్స్‌లో కేసులు పెట్టడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close