‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

‘ఆర్య’.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆర్య పాత్రకి లక్షల మంది అభిమానులు వున్నారు. ఆర్య2 గొప్ప విజయం సాధించనప్పటికీ ఆర్య పాత్రకి వున్న గ్రేస్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆర్య 3కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల నుంచి ఆర్య 3 చర్చల్లో వుంది.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏమిటంటే.. పుష్ప తర్వాత సుకుమార్ చేయబోయే కొత్త సినిమా ఆర్య 3నే. ట్విస్ట్ ఏమిటంటే.. ఇందులో హీరో మాత్రం అల్లు అర్జున్ కాదట. ఆర్య 3గా విజయ్ దేవరకొండ కనిపిస్తారని ఓ టాక్ బయటికి వచ్చింది. సుకుమార్- విజయ్ దేవర కొండ ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే సుకుమార్ , విజయ్ ని ఆర్య 3గా చూపించాలని భావిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఆలోచన క్రేజీగానే వుంది కానీ .. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంకా క్రేజీగా వుంది. ఎందుకంటే ఆర్య అనగానే అల్లు అర్జున్ నే గుర్తుకు వస్తాడు. ఇప్పుడు సుకుమార్ వెరైటీగా ఆలోచించి ఆర్యగా విజయ్ ని చూపించడం ఓ సాహసమే అవుతుంది. అటు విజయ్ కి కూడా ఆర్యగా కనిపించడం ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close