ఫ్రాన్స్ అధ్యక్షుడి భద్రతకి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అమెరికా

ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండీ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఆయన గౌరవార్ధం ఫ్రాన్స్ ఆర్మీకి చెందిన ఒక బృందం కూడా రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనేందుకు అనుమతించబడుతోంది. ఫ్రాన్స్ కూడా అమెరికాతో కలిసి సిరియా తదితర ప్రాంతాలలో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై జరుగుతున్న వైమానిక దాడులలో పాల్గొంటోంది కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండీ భారత్ వచ్చినప్పుడు దాడి చేస్తామని ఐసిస్ ఉగ్రవాదుల నుంచి భారత్ లోని ఫ్రాన్స్ దౌత్యకార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ అందింది.

డిల్లీలోకి ముగ్గురు ఉగ్రవాదులు జొరబడ్డారనే నిఘా వర్గాల హెచ్చరికలతో డిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసారు. ఇంకా దేశవ్యాప్తంగా ఎన్.ఐ.ఎ. అధికారులు ఉగ్రవాదుల సానుభూతిపరులను గుర్తించి ఏరివేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పఠాన్ కోట్ దాడి అనంతరం డిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ మొదలయిన రాష్ట్రాలలో భద్రతను చాలా కట్టుదిట్టం చేసి భద్రతాదళాలు వేయి కళ్ళతో కాపలా కాస్తున్నాయి.

డిల్లీ చెందిన స్పెషల్ పోలీస్ సెల్ అధికారులు గత వారమే మేవట్ జిల్లా నుంచి అల్-ఖైదా మద్దతుదారుడు ఒకరిని అరెస్ట్ చేసారు. వివివిఐపిల పర్యటన కారణంగా గుర్ గావ్, ఫరీదాబాద్ మరియు వాటికి రెండు కిలోమీటర్ల పరిధిలో జనవరి 24 నుంచి 26 వరకు సెక్షన్: 144 విధించారు. చివరికి ఆ పరిధిలోగల షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, మార్కెట్లు, ఇతర ముఖ్యమయిన కూడళ్ళలో కూడా సెక్షన్: 144 విధించి, చాలా కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. గత వారం పదిరోజులుగా ఆ ప్రాంతలన్నిటినీ డిల్లీ, హర్యానా పోలీసులు, బాంబు స్క్వాడ్స్, నిఘావర్గాలు కమ్ముకొని ఉన్నాయి.

ఎన్.ఐ.ఎ. అధికారులు, నిఘా సంస్థలు, భద్రతాదళాలు, వివిద రాష్ట్రాల పోలీసులు ఇంకా అనేక ఇతర సంస్థలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే అమెరికా మాత్రం ఎప్పటిలాగే పెద్దన్న పాత్రలో పెత్తనం చెలాయిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడి, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండీ కలిసి ఈ నెల 25న డిల్లీకి సమీపంలో గుర్ గావ్-ఫరీదాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వద్ద ఒక కార్యక్రమంలో పాల్గోబోతున్నారు. అమెరికా, ఫ్రాన్స్ మిత్రదేశాలు కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండీ గుర్ గావ్ పర్యటన సందర్భంగా ఆయనకి భద్రత కల్పించేందుకు అమెరికాకి చెందిన సి.ఐ.ఏ. సంస్థ కూడా రంగంలోకి దిగింది.

గుర్ గావ్, ఫరీదాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాలలో క్రైం రికార్డులను తనకు సమర్పించవలసిందిగా సి.ఐ.ఏ. సంస్థ హర్యానా పోలీసులను కోరింది. హోలాండీకి సరయిన భద్రత కల్పించడం కోసమే ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలియజేసింది. గుర్ గావ్, ఫరీదాబాద్ జిల్లాల ఉన్నతాధికారులను హోలాండీ భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసారో తెలియజేయవలసిందిగా సి.ఐ.ఏ. కోరింది. ఆరావళి పర్వత ప్రాంతాలలో అక్రమ మైనింగ్ చేసే గ్యాంగులు, నేరస్తులు చాలా ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారో తెలియజేయవలసిందిగా కోరింది.

అమెరికా ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసి ఆ జిల్లాల పరిపాలన, పోలీస్ ఉన్నతాధికారులు కూడా చాలా విస్మయం చెందుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండీని మన దేశానికి ఆహ్వానించినపుడు ఆయన భద్రతకు భారత్ దే పూర్తి బాధ్యత అవుతుంది. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఆ దేశానికి చెందిన నిఘావర్గాలు, సంబంధిత సంస్థలు ఇటువంటి చొరవ తీసుకొన్నా, వివరాలు కోరినా అర్ధం చేసుకోవచ్చును. కానీ అమెరికాకి ఏమాత్రం సంబంధంలేని విషయంలో కూడా ఈవిధంగా కలుగజేసుకొని అత్యుత్సాహం ప్రదర్శించడం ఎవరూ హర్షించలేరు.

అదే ప్రధాని నరేంద్ర మోడి లేదా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమెరికాలో పర్యటించేటపుడు భారత్ నిఘావర్గాలు, పోలీసులు అమెరికా అధికారులను ఇటువంటి వివరాలు కోరే సాహసం చేయగలరా? కోరినా అమెరికా ఇస్తుందా? అమెరికా గడ్డ మీద భారత్ పోలీసులు, నిఘవర్గాలు ఈవిధంగా దైర్యంగా తిరగగలవా? ఇప్పుడు భారత్ ని అడుగుతున్నట్లుగానే చైనాని అడగగాలదా? అంటే అన్నిటికీ లేదనే సమాధానం వస్తుంది. అటువంటప్పుడు అమెరికా అడుగుతున్న వివరాలను అందించవలసిన అవసరం భారత్ కి ఏమిటి? అంటే అమెరికాను ప్రశ్నించే, ఎదిరించే సాహసం లేనందునేనని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close