ఫిబ్రవరి 28న ‘ఊపిరి’ ఆడియో

కింగ్ నాగార్జున, యువ హీరో కార్తి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఊపిరి. విజయవంతమైన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘ది ఇన్ టచబుల్స్’ కు అఫిషియల్ రీమేక్ సినిమాగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 25న విడుదల ముహూర్తం పెట్టారని తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఆడియోను ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

నాగార్జున, కార్తి స్నేహితులుగా నటిస్తున్న ఊపిరిలో సినిమాలో ఎక్కువ భాగం నాగ్ వీల్ చైర్ లోనే ఉంటూ అభినయాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. తమన్న కథానాయికగా చేస్తున్న ఊపిరిలో అనుష్క, అడివి శేష్ లు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మలయాళ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. లాస్ట్ ఇయర్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్ సినిమాలకు సంగీతాన్ని అందించి సినిమా విజయంలో సంగీతం కూడా ఓ ప్రధాన కారణమయ్యేలా చేసుకున్న గోపి సుందర్ ‘ఊపిరి’ సినిమాకు కూడా వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్నారట.

పరిశ్రమలో వ్యక్తులు కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఉత్సాహాన్ని చూపుతున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఈ సినిమా కోలీవుడ్ లో కూడా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. మరి విడుదలకు ముందే ఇంత హైప్ వస్తే సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close