మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి 127వ నెంబర్ దక్కింది. రెండు నెలల కిందటే ఆయనకు ఈ నెంబర్ దక్కినా బయటకు రానివ్వలేదు. ఇప్పుడే తనను అరెస్టు చేస్తారన్న భయంతో కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఈ 127వ నెంబర్ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో.. ఆయన నెంబర్. ఈ దాడిలో ఆయన పాత్ర ఉందని 127వ నిందితుడిగా చేర్చారు. రెండు నెలల కిందటే పోలీసులు ఈ పని చేశారు. అప్పట్లో ఆర్కేకు విషయం తెలిసింది. కానీ సైలెంటుగా ఉన్నారు.
ఇప్పుడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన హడావుడిగా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను అరెస్టు చేస్తారో లేదో కానీ.. భయంతో కోర్టుకెళ్లారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుండి ఆర్కే బయట కనిపించడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన అరాచకాలకు లెక్కలేదు. వరదలు వచ్చినప్పుడు.. బ్యారేజీ గేట్లను మూసివేసి దగ్గర ఉండి చంద్రబాబు ఇంటిని ముంచాలని ప్రయత్నించారు కానీ వర్కవుట్ కాలేదు.
సజ్జల రామకృష్ణారెడ్డిని.. బోషడికే అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. బోషడికే అంటే పెద్ద బూతు అని దాన్ని జగన్ ను ఉద్దేశించే అన్నారని చెప్పి.. పార్టీ రౌడీ నేతలను ..దాడులకు పురికొల్పారు. దేవినేని అవినాష్ , అప్పిరెడ్డి, ఆర్కే లాంటి వాళ్లు తమ రౌడీ అనుచరుల్ని మొబిలైజ్ చేసి టీడీపీ ఆఫీసుపై దాడి చేయించారు. పోలీసులు సహకరించారు. అప్పట్లో నామమాత్రంగా కేసు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ చట్టబద్ధంగా సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పుడు ఆర్కే వంతు వచ్చింది.