హీరో..నిర్మాత..చెరోదారి?

అల్లు శిరీష్. ఎలాగైనా సరైన హీరో అనిపించుకోవాలన్న తాపత్రయం. మధురశ్రీధర్ ఎలాగైనా ఓ సినిమా చేయాలన్న ప్రయత్నం. రెండూ కలిసి ఎబిసిడి అనే సినిమాకు దారితీసాయి. సినిమా తయారైపోయింది. అంతే, అలా వుంది. ఆ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందన్న దాంట్లో మాత్రం క్లారిటీ లేదు.

ఇదిలా వుంటే సినిమా నిర్మాణంలో వుండగానే అల్లు శిరీష్ టాప్ హీరో లెవెల్లో చాలా చేసారని గుసగుసలు వున్నాయి. కొంతమంది టెక్నీషియన్లను మార్పించారని, ఆఖరికి తన స్వంత పీఆర్ టీమ్ నే మార్పించేసారని కూడా వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు ఆఖరికి విడుదల ముందు సినిమాను అల్లు అరవింద్ చూసారు. దాన్ని ఎలా రిపేర్ చేయాలా అని డిస్కషన్లు మొదలయ్యాయని టాక్.

ఇలాంటి టైమ్ లో నిర్మాత, హీరోల మధ్య ఎడిటింగ్ వెర్షన్ మీద ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో హీరో, నిర్మాత ఉప్పు, నిప్పులా వున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ కొడుకు శిరీష్ ను సపొర్ట్ చేయడం లేదని తెలుస్తోంది.

దాంతో ప్రస్తుతానికి సినిమాను అలా వుంచారు. ఎప్పుడయితే అల్లు అరవింద్ ఓ నిర్ణయానికి వస్తారో? అప్పుడు సినిమా విడుదల ఎప్పుడు అన్నది తేలుతుంది. అంతవరకు ఎబిసిడి నే..ఇ..ఎఫ్..జి..హెచ్ ఆ తరువాతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close