ప్ర‌తిరోజూ పండ‌గ‌లో.. క్లైమాక్స్ ట్విస్ట్ సూప‌ర్‌!

ఈమ‌ధ్య ద‌ర్శ‌కులు ట్విస్టులు మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నారు. ఇంట్ర‌వెల్‌లోనో, ప్రీ క్లైమాక్స్‌లోనూ ఓ ట్విస్టు వ‌స్తుంది. ఆంతో సినిమా స్వ‌రూప‌మే మారిపోతుంది. సినిమా అంతా ఒక ఎత్తు, ఆ ట్విస్టు మ‌రో ఎత్తు అయిపోతాయి. సాహో, అజ్ఞాతవాసి, ఎవ‌రు సినిమాల్లో ఇలాంటి ట్విస్టులే చూశాం. ఇప్పుడు ప్ర‌తిరోజూ పండ‌గ క్లైమాక్స్‌లోనూ ఓ అదిరిపోయే ట్విస్టు ఉంద‌ట‌.

ఓ తాత‌య్య క‌థ ఇది. మ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న తాత‌య్య – చివ‌రి రోజు స‌ర‌దాల‌ను తీర్చ‌డానికి మ‌న‌వ‌డు చేసే ప్ర‌య‌త్నం. చావు కూడా ఓ పండ‌గ‌లా చేసుకోవాల‌న్న సందేశం పంపుతున్నాడు మారుతి. క‌థ‌లో ఎమోష‌న్‌, సెంటిమెంట్, వినోదం.. ఇవ‌న్నీ ఉండేలా చూసుకున్నాడు. దీంతో పాటు క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు అట్టిపెట్టుకున్నాడు మారుతి. ఆ ట్విస్టు వ‌ల్ల క‌థ స్వ‌రూప‌మే మారిపోబోతోంద‌ట‌. సాధార‌ణంగా థ్రిల్ల‌ర్‌లోనూ, యాక్ష‌న్ చిత్రాల‌లోనూ ట్విస్టులు రాసుకుంటారు. ఫ్యామిలీ డ్రామాలో కూడా ట్విస్టు జోడించ‌డం.. కొత్త‌గానే అనిపిస్తోంది. ఆ ట్విస్టు ఏమిట‌న్న‌ది ఇప్పుడే చెప్ప‌కూడ‌దు. థియేట‌ర్లో చూడాల్సిందే. సాయిధ‌ర‌మ్ తేజ్ – రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈనెల 20న వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com