స్టాలిన్ : మీడియాపై ఉక్కుపాదం పాలకుల అమాయకత్వమే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల్లో మీడియాను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ పరంగా తీసుకున్న.. జరిగిన నిర్ణయాలు లెక్క లేనన్ని ఉన్నాయి. దాడులు, చట్ట విరుద్ధ నిషేధాలు, బెదిరింపులు, ఆదాయ మార్గాలు దెబ్బకొట్టడం లాంటివి.. తెర వెనుక ఎంత ఉద్ధృతంగా చేస్తున్నారో.. తెర ముందు కూడా.. మీడియాకు సంకెళ్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ మీడియా స్వేచ్ఛతోనేగా ఐదేళ్లు అడ్డగోలు బురద చల్లింది..!

అసలు మీడియా అంటే ఏమిటో.. భారత ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఏమిటో తెలియకుండా.. ఇలాంటి కక్షసాధింపులు, కట్టడి చర్యలు తీసుకుంటున్నారంటే.. ఓ అర్థం ఉంటుంది. కానీ.. తాను ప్రతిపక్షంలో ఉన్నంత కాలం.. సొంత మీడియాను నడుపుతూ.. ఆ మీడియా స్వేచ్చను రాజకీయ ప్రయోజనాల కోసం అపరిమితంగా వాడుకున్న చరిత్ర ఏపీ పాలకులది. ఇష్టం లేని పాలకులపై ఆయన మీడియా ప్రసారం చేసిన కథనాల్లో.. ఒక్క శాతం అయినా వాస్తవాలు ఉన్నాయో లేవో.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. బయట పెట్టలేని పరిస్థితి. కానీ.. తమ దగ్గరకు వచ్చే సరికి… మీడియా నిజాలైనా సరే.. చెప్పకూడదని.. భావిస్తున్నారు. తాను అనుభవించిన మీడియా స్వేచ్చను.. తాను అధికారంలోకి వచ్చాక ఇంకెవరూ అనుభవించకూడదనుకుంటున్నారు..

ప్రజలు నమ్మిన మీడియా సంస్థలకే మనుగడ…!

మీడియా మనుగడ విశ్వసనీయత మీదే ఆధారపడి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టిన మీడియాలు మనుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేవు. అందుకే.. మీడియా సంస్థలు.. తమ విధానాలకు అనుగుణంగా.. విశ్వసనీయమైన కథనాలే అందిస్తాయి. ప్రజల నమ్మకాన్ని చూరగొంటాయి. మీడియా అంటే.. ప్రభుత్వాలకు ఎదురొడ్డి.. ప్రతిపక్షంగా వ్యవహరించేదే. తెలుగు మీడియా ఈ విషయంలో ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంది. అందుకే… అసాధ్యమైన హామీలు.. ఇచ్చి.. అంచనాలకు అందుకోలేక.. చతికిలపడుతున్న సర్కార్‌కు.. తమ వైఫల్యాలు బయటకు రాకుండా.. మీడియాను కట్టడి చేయాలనుకుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

ప్రశ్నించే గొంతుల్ని మూసేస్తే ప్రజల్ని ఏ మార్చొచ్చా…?

చట్ట విరుద్ధమైన నిషేధాలు.. కేబుల్ ఆపరేటర్లకు బెదిరింపులు వంటి ఉండటమే విషాదం. ఇలాంటి పరిస్థితులను చూస్తే.. ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోయిందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఏర్పడుతోంది. ప్రశ్నించే మీడియా లేకపోతే.. పాలక పక్షానికి తిరుగుండదు. ఎవరో చూస్తున్నారన్న భయం లేకపోతే… పాలకుల్లో నియంతృత్వం పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close