తెలంగాణ టీడీపీకి చంద్రబాబు ఏం చెప్పారబ్బా..?

తెలంగాణ మహానాడులో పాల్గొన్న చంద్రబాబు.. ఆ పార్టీ నేతలకు అంతిమంగా ఏం సందేశం ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్‌పై కానీ.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై కానీ ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. కానీ బీజేపీని పూర్తిగా టార్గెట్ చేశారు. తెలంగాణలో భారతీయ జనతాపార్టీని టార్గెట్ చేసి.. సాధించేదేమీ లేదు. అలాగే ఆయన జాతీయ రాజకీయాలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపైనా విమర్శలు గుప్పించారు. మోదీ సర్కారు వైఫల్యాల గురించి మాట్లాడారు. కానీ అంతిమంగా తెలంగాణ నేతలకు మాత్రం ఎలాంటి సందేశం ఇవ్వకుండా… సాదాసీదాగా ప్రసంగాన్ని ముగించేశారు. అనేక సందేహాలను అలాగే ఉంచేశారు.

నిజానికి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చివరి మహానాడును జరుపుకుంటోంది. గతమెంతో ఘనం లాంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతోంది. నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా… పునాదులు బలమైనవి కావడంతో ఓటు బ్యాంక్ ఇంకా మిగిలే ఉందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో ఉంది. కానీ ఇది.. తెలంగాణలో గెలిచే స్థాయిలో లేదు. కనీసం కింగ్ మేకర్ అవుతుందన్న ఆశలు కూడా అడుగంటిపోయాయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్న చర్చలు .. ఇటీవలి కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. కొంత మంది కాంగ్రెస్ మంచిందంటున్నారు..మరికొంత మంది టీఆర్ఎస్ బెటరంటున్నారు.
ఇలా చర్చించుకుంటున్న వాళ్లందరూ.. టీడీపీతో సంబంధం లేని వాళ్లే. కానీ పధ్నాలుగేళ్లుగా అధికారంలో లేనప్పటికీ.. పార్టీని నమ్ముకున్న తెలంగాణ సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబుపైనే భారం వేసి.. బండి లాగుతున్నారు. వీరి ఆశలు కూడా పొత్తులే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే చాన్స్ లేదనే.. రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోయారు. ఆ తర్వాత టీఅరెస్‌తో పొత్తుకు అంతా రెడీ అయిందని ప్రచారం జరిగింది. కానీ క్లారిటీ మిస్సయింది. తాజాగా కేంద్రాన్ని ఢీకొట్టేందుకు చంద్రబాబు చేస్తున్న జాతీయ స్థాయి కూటమి రాజకీయాలు..మరో విశ్లేషణను తెర ముందుకు తెస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే చాన్స్ ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మహానాడు ప్రసంగంలో ఓ క్లారిటీ ఇస్తారనుకున్నారు.

కానీ ఈ పొత్తులపై టీడీపీ అధినేతకు ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదన్నట్లుగా ప్రసంగం ఉంది. కాంగ్రెస్ పార్టీనీ ఏమీ విమర్శించలేదు.. టీఆర్ఎస్ విషయంలోనూ సంయమనం పాటించారు. అంటే రెండు పార్టీలకు.. దగ్గరగా..దూరంగాఉన్నట్లు మాట్లాడారు. అలాగని ఒంటరిగా పోటీ చేసే అవకాశం కూడా లేదు. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ మాత్రం దూరమే. ముందు ముందు జరగబోయే పరిణామాలు… టీ టీడీపీ వెళ్లే దిశను నిర్ణయించవచ్చు… కొసమెరుపేమిటంటే… మహానాడులో కళాకారులు.. కేసీఆర్ ను ఉద్దేశించి కొంచెం ఘాటు పదాలతోనే పాటలు పాడారు. కానీ… టీ టీడీపీ అధ్యక్షుడు రమణ మాత్రం అభ్యంతరం చెప్పారు. నేరుగా వేదిక మీద నుంచి క్షమాపణ కూడా చెప్పారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close