రూ. ఏడు కోట్లతో సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది వాహనాలతో కూడిన కాన్వాయ్ కోసం రూ. ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టనున్నారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. జీవోల కాన్వాయ్ సీఎం జగన్ కోసం అని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పది బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలనుకొనుగోలు చేయాలని.. అందు కోసం రూ. ఆరు కోట్ల 75 లక్షలు విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంత భారీ ఖర్చుతో కొనుగోలు చేసే వాహనాలను ముఖ్యమంత్రి కోసమే ఉపయోగిస్తారు. మరిన్ని హంగులు సమకూర్చేందుకు మరికొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

అది ఆ కాన్వాయ్ నిర్వహించే శాఖ కాథాలో పడే అవకాశం ఉంది. నిజానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ కొత్త కాన్వాయ్ కొనుగోలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు మరో కాన్వాయ్ ఉపయోగిస్తారు. ఇప్పుడు.. ఆ కాన్వాయ్ కొనుగోలు చేసి రెండేళ్లు అవుతుంనో.. లేకపోతే.. మరో కారణమో కానీ.. కొత్త కాన్వాయ్ కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అత్యంత దారుణంగా ఉందని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. పది నెలల్లో రూ. 75వేల కోట్ల అప్పు చేసిందని కాగ్ తేల్చింది.

అతి అత్యదికమని.. ఇంత అప్పు చేసినా లోటు దారుణంగా ఉందని.. దివాలా దశకు ఏపీ దగ్గరగా ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇంత అప్పు చేస్తున్నా… అభివృద్ధి కార్యక్రమాలపై పెడుతున్న ఖర్చు తక్కువే. అనుత్పాదక వ్యయం ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా పది కార్ల అత్యాధునిక కాన్వాయ్ కోసం మరో ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close