గంటా చేరిక ఫైల్ జగన్ వద్ద ఉందట..!

గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీలో యాక్టివ్‌గా మారుతున్నారనో.. లేకపోతే.. ఆయన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసినా తర్వాత వైసీపీలో చేరుతారని చెప్పడానికో కానీ విజయసాయిరెడ్డి గంటా మెడలో గంట కట్టారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పంపించారని అవి ప్రస్తుతానికి జగన్ వద్ద ఉన్నాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ నిర్ణయం తీసుకుంటే గంటా పార్టీలో చేరుతారన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరునిగా ఉన్న కాశీవిశ్వనాత్ అనే వ్యక్తి.. విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గంటా ప్రస్తావన విజయసాయిరెడ్డి తీసుకువచ్చారు. గంటా వైసీపీలో చేరుతారని పలుమార్లు ప్రచారం జరిగింది.

అవంతి శ్రీనివాస్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు… అందుకే ఆయన చేరిక ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే గంటా… మంత్రి పదవితో పాటు విశాఖలో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదనలు పెట్టినట్లుగా తెలుస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోతోందంటున్నారు. ఈ కారణంగా ఆయన చేరిక పెండింగ్‌లో పడిందన్న తెలుస్తోంది. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి గంటా టీడీపీకి దూరంగానే ఉన్నారు. ఆయన వ్యాపారాలు.. భయాల కారణంగా బీజేపీలో కూడా చేరుతారని అనుకున్నారు.

సోము వీర్రాజు లాంటి వాళ్లు గంటా చేరుతారని నేరుగానే ప్రకటించారు. కానీ జరగలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత గంటా యాక్టివ్ గా మారారు. రాజీనామా చేశారు. వైసీపీ, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి .. ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. దీనిపై గంటా స్పందిస్తారో లేదో క్లారిటీ లేదు. గంటా రిజర్వేషన్స్ గంటాకు ఉన్నాయి కాబట్టి.. ఆయన సైలెంట్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close