వలంటీర్లను సన్మానించనున్న సీఎం జగన్..!

వలంటీర్ల సేవలను గుర్తించిన సీఎం జగన్ వారికి జీతాలు పెంచడం మినహా గొప్ప గౌరవ మర్యాదలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. వారు అందించే సేవలను బట్టి మూడింటిలో ఒక దానికి ఎంపిక చేస్తారు. వాటికి నగదు పురస్కారాలు కూడా ఉంటాయి. సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో జరిగే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఆయన వాలంటీర్లను ఆత్మ బంధువులుగా చూస్తున్నారు.

పెన్షన్ల పంపిణీ, విధులకు హాజరు, యాప్‌ల వినియోగం. పథకాల అమల్లో చురుగ్గా భాగస్వామ్యం అయిన వారికి అవార్డులు లభిస్తాయి. మొదటి కేటగిరి సేవామిత్ర కోసం ప్రశంశాపత్రంతో పాటు రూ. పదివేల నగదు ఇస్తారు. రెండో కేటగరిలో రూ. ఇరవై వేల పురస్కారం ఇస్తారు. రెండో కేటగరిలో ప్రతి మండలానికి ఐదుగురు వాలంటీర్లకు అవార్డులిస్తారు. మూడో కేటగిరిలో క్యాష్ ప్రైజ్ రూ. 30వేలు ఇస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగుర్ని ఎంపిక చేస్తారు. వీరందరి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. ఉగాది నుంచి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వాలంటీర్లు రూ. ఐదు వేలకే పని చేస్తున్నారు. ఇటీవల జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. జీతాలు పెంచే చాన్సే లేదని.. వారు సేవ మాత్రమే చేస్తున్నారని తేల్చిన సీఎం జగన్.. సేవలకు గుర్తుగా అవార్డులు ఇస్తామన్నారు. ఆ ప్రకారం.. ఇప్పుడు… అవార్డులు.. సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన కూడా స్వయంగా పాల్గొని.. వాలంటీర్లను సన్మానించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌... ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close