‘పద్మ‌వ్యూహం’లో చిక్కుకున్న సుశాంత్

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల కాలం ఇది. కాన్సెప్ట్ బాగుంటే, స్టార్లు ఉన్నా లేకున్నా, బ‌డ్జెట్లు పెట్టినా, పెట్ట‌క‌పోయినా వ‌ర్క‌వుట్ అయిపోతోంది. ఇంత వ‌ర‌కూ మాస్‌, ల‌వ్ స్టోరీలు చేసిన సుశాంత్ కూడా ఈమ‌ధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా రూపుదిద్దుకున్న సినిమా `ఇచ్చ‌‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు`. ఇదో కొత్త త‌ర‌హా క‌థ అనే సంగ‌తి టైటిల్ లోనే చెప్పేశారు. టీజ‌ర్లు, ప్ర‌చార చిత్రాలూ అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ క‌థ టెంపో ఎలాంటిదో చెబుతూ ఓ పాట‌ని విడుద‌ల చేశారు.

”ప‌ద్మ‌వ్యూహం లోనికి చొర‌బ‌డి
బ‌య‌ట‌కు మ‌ర‌లే దారే లేదా?

గ‌ద్ద‌ల తాకిడి త‌ట్టుకునిల‌బ‌డి
నిర్దోషిత్వం రుజువే కాదా..?

పొద్దుట యుద్ధం పొడ‌మే ఎరుగ‌ని
లోకం తెలియ‌ని గూడే విడువ‌ని
వాడే వీడే అభిమ‌న్యుడు కాగా..” అంటూ సాగే ఈ గీతాన్ని… అరుణ్ వేమూరి రాశారు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ పాడారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు స్వ‌ర‌కర్త‌. ఈ పాట‌ని ఈరోజు… వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు.

ఈ సినిమా కాన్సెప్ట్ ని చెప్పే గీతం ఇది. మ‌రి… సుశాంత్ ఎలాంటి ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్నాడో.. అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close