బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యంగా మాట్లాడారని ఆయన జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాదరి కిషోర్ కు నోటీసులు జారీ చేశారు. తుంగతుర్తి నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన కేటీఆర్ ను విమర్శించేవారిని బూతులు తిట్టి కాలర్ ఎగరేస్తారు. ఆయనను కేటీఆర్ ప్రోత్సహిస్తారు.
ఇటీవల కేటీఆర్ .. రుత్విక్ సంస్థకు వచ్చిన ఓ కాంట్రాక్ట్ ను చూపించి… సీఎం రమేష్ పై ఆరోపణలు చేశారు. దీంతో సీఎం రమేష్..కేటీఆర్ విలీన కథలు చెప్పారు. తన వద్దకు వచ్చి బీజేపీలో విలీనం కోసం మధ్యవర్తిత్వం చేయమని కోరాడని చెప్పారు. కానీ బీజేపీ అంగీకరించలేదన్నారు. కావాలంటే తన ఇంటి సీన్ ఫుటేజీ బయటపెడతానన్నారు. కానీ ఈ మాటలను ఖండించలేకపోయిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం రమేష్ పై బూతులందుకున్నారు. చాలా మంది రాజకీయ విమర్శలు చేశారు కానీ.. గాదరి కిషోర్ మాత్రం బూతులు తిట్టారు.
దీంతో సీఎం రమేష్ చట్ట ప్రకారమే వెళ్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ..గాదరి కిషోర్ లాంటి నేతల్ని మళ్లీ విమర్శిస్తే.. ఆయనకు పబ్లిసిటీ వస్తుంది. అలా కాకుండా నేరుగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ మాజీ ఎమ్మెల్యే స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది.