తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో నుంచి పోతా పోతా అంటున్న ఎల్ అండ్ టీని పంపేశారు. చాలా కాలం నుంచి ఎల్ అండ్ టీ .. హైదరాబాద్ మెట్రోపై అనాసక్తిగా ఉంది. తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బులు వస్తే చాలు పోతామని అంటోంది.నిర్వహణ తమ వల్ల కాదని తీసుకోవాలని లేఖలు రాస్తోంది.ఇటీవల కూడా ఓ లేఖ రాసింది.దాంతో రేవంత్ ఆ సంస్థను పంపేయాలని నిర్ణయించుకున్నారు.
ముందుగా ఎల్ అండ్ టీ కోసమే పని చేస్తున్నట్లుగా ఉన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేశారు. వెంటనే చర్చలు పూర్తి చేశారు. ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టు కోసం చేసిన పదమూడు వేల కోట్ల రూపాయల అప్పును టేకోవర్ చేయడంతో పాటు రూ.5900 కోట్ల మేర ఈక్విటీని చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి తీసుకు రావాలని రేవంత్ అనుకున్నారో కానీ…డీల్ క్లోజ్ చేసుకున్నారు.
మెట్రోను విస్తరించాలని అనుకుంటున్న రేవంత్ కు ఎల్ అండ్ టీ సహకిరంచలేదు. ప్రత్యేకంగా సంస్థను పెట్టి మెట్రోను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ కారణంగా మెట్రో రెండో విడత పట్టాలెక్కడం లేదు. దేశంలో చాలా మెట్రోలు..ధర్డ్ ఫేజ్..ఫోర్త్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించుకుని మెట్రో విస్తరణకు రేవంత్ గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.