చింతమడకలో చీరి చింతకు కడతామని కేసీఆర్‌కు.. సీఎంరేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొడంగల్‌లో కొత్తగా గెలిచిన సర్పంచ్‌లను అభినందించేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కేసీఆర్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌లో ఉండి తోలు తీయడం నేర్చుకున్నారని.. మటన్ కొట్టు మస్తాన్ వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలు విరగ్గొట్టున్నారన్నారు.
మేము మాట్లాడటం మొదటి పెడితే.. ఉరేసుకుంటాడాన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తనను జైలుకు పంపడమే కాక తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడన్నారు. అయినా అధికారంలోకి వచ్చిన తరవాత ఆయన పాపానికి ఆయనే పోతామని వదిలేశామన్నారు. కేసులు కూడా పెట్టలేదని.. కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. మా సర్పంచ్ల వద్దకు రా.. ఎవరి తోలు ఎవరు తీస్తారో తెలుస్తుందన్నారు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారని గుర్తు చేశారు. తానేమీ దుబాయ్ పాస్ పోర్టుబ్రోకర్ గా చేయలేదని.. రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదన్నారు.
రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని రేవంత్ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కిపైగాసీట్లు సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తండ్రి గాలికి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కవితను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డకు చీరపెట్టని వాడు.. చెల్లి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలని వాడు తనకు సవాల్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఉడతఊపులకు భయపడేవాడ్నికాదని.. ఎన్ని సార్లు అయినా అసెంబ్లీ పెడతామని సవాల్ చేశారు.
తండ్రీ,కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మానేసి.. పార్టీ ఆఫీసులో కాదని.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. పాలమూరుకు కేసీఆర్ వలస వచ్చి ఎంపీ అయ్యారు. తర్వాత సీఎం అయ్యారు. అయినా ప్రాజెక్టుల్నిపూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ లో చేసిన ప్రతి విమర్శకు కేటీఆర్ అదే లాంగ్వేజ్‌లో సమాధానం ఇచ్చారు.
