ముసలి కొబ్బరితోటలకు కార్పొరేట్ జవసత్వాలు

గోదావరి జిల్లాలల్లో కొబ్బరితోటలు ముసలివైపోతున్నాయి. దాదాపు సగం తోటల వయసు 60 ఏళ్ళు దాటుతున్నాయి. కాయలు కుంచించుకుపోతున్నాయి. ఇదేపరిస్ధితి కొనసాగితే ఇంకో పదిపన్నెండేళ్ళలో కొబ్బరి అంతరించిపోతుంది. ఈ నేపధ్యాన్ని కార్పొరేట్ రంగం వినియోగించుకుంటోంది.

రాజమండ్రి సమీపాన వి2సి గ్రూప్ త్వరలో ‘ఇంటిగ్రేటెడ్ కోకో పార్కు’ నెలకొల్పనున్నది. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వ్యయం కాగల కోకో పార్కులో ప్రధాన పరిశ్రమ (యాంకర్ ఇండస్ట్రీ)ని వి2సి గ్రూప్ నెలకొల్పుతుంది. పార్కులో అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల పెట్టుబడి మరో 300 కోట్ల రూపాయల నుంచి 350 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.

కోకో పార్కు ఏర్పాటులో ఉద్దేశం ‘ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్ ప్ట్’ .అంటే కొబ్బరి పంట ఉత్పత్తి నుంచి దిగుబడి దాకా, కొబ్బరి కాయలో ప్రతి పదార్థాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి పంటను రైతుకు లాభసాటిగా మారుస్తామని వి2సి సంస్థ చెబుతోంది.

కోకో పార్కు ఏర్పాటు వల్ల కంపెనీలు పంటను వెనువెంటనే కొనుగోలు చేసి అక్కడికక్కడే డబ్బు చెల్లిస్తాయని పూర్తిస్థాయి పంట దిగుబడి మెరుగుపరిచే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని సంస్ధ సిఎండి రామ్ కుమార్ వివరిస్తున్నారు..

కోకో పార్కు ప్రధాన పరిశ్రమతోపాటు అనుబంధంగా మరో 15 పరిశ్రమలు వస్తాయని, కొబ్బరి పంట ఉత్పత్తికిగాను రైతులకు అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెట్టడం కోకో పార్కు ఏర్పాటు ప్రధాన ధ్యేయమన్నారు. కొబ్బరి పంట మార్కెటింగ్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం జరుగుతుందని, ముడి కొబ్బరి పంట, కొబ్బరి నుంచి టెంకాయ, పీచు, ఇలా ప్రతి పదార్థాన్ని వినియోగంలోకి తెస్తామని అన్నారు.

కోకో పార్కు ఆధ్వర్యంలో తాము 10 వేల మంది యువ రైతుల్ని ఎంపిక చేసి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించటంలో సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారుస్తామని చెప్పారు. 3 వేల మంది కొబ్బరి రైతులతో ఒక గ్రూప్ చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల వారు కొబ్బరి దిగుబడిలో పరిజ్ఞానం పెంచుకుంటారని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close