‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రాకకు మరో వారం రోజులే మిగిలుంది. ప్రస్తుతం నిర్మాతలు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ‘కాలరే ఎత్తరా’ పాట ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓజీ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చినప్పటికీ పవన్ సిగ్నేచర్ డ్యాన్స్, మాస్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ లో దర్శకుడు హరీశ్ శంకర్ వాటిపైనే దృష్టిపెట్టాడని ‘కాలరే ఎత్తరా’ పాట వింటే అర్ధమౌతుంది.
దేవిశ్రీ హార్మోనియం బిట్ తో సాంగ్ ని మొదలుపెట్టిన విధానం మాస్ లోకి వెంటనే చొచ్చుకుపోయింది. ఆ తర్వాత వందల మంది డాన్సర్స్ తో కలసి పవన్ చేసిన మూమెంట్స్ మరోస్థాయిలో వున్నాయి. ఆయన్ని ఇంత హుషారుగా చూసి చాలా కాలమైన ఫీలింగ్ కలిగింది. మేకింగ్ వీడియోలో దర్శకుడు హరీష్ కూడా హుషారుగా స్టెప్స్ వెయ్యడం కనిపించింది.
ముఖ్యంగా కాసర్ల శ్యాం రాసిన సాహిత్యం పవన్ మాస్ ఇమేజ్ ని మ్యాచ్ చేసేలా సాగింది. మాస్ లో వున్న పదాలనే తీసుకున్నారు. ‘కోట మీద జండాలా.. నీలో పొగరే ఉండాలా”లాంటి లైన్స్ పవన్ వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. ఈ పాట థియేటర్లో కావాల్సిన కిక్ ఇవ్వడం ఖాయం.
