ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్న భద్రతాదళాలు

పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి తరువాత ఇప్పుడు ఆ పరిసరాలలో కొత్త వ్యక్తులు ఎవరు కనబడినా అందరూ అనుమానంగా చూస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుకి అతి సమీపంలో ఉన్న గురుదాస్ పూర్, పఠాన్ కోట్ పట్టణాలలోకి ఐదుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో భద్రతాదళాలు అప్రమత్తం చేయబడ్డాయి. గురుదాస్ పూర్ జిల్లాలో తిబ్రి అనే గ్రామంలో మిలటరీ దుస్తులు ధరించిన ఇద్దరు కొత్త వ్యక్తులను చూసామని గ్రామస్తులు స్థానిక పోలీసులకు తెలియజేయడంతో వారు తక్షణమే ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేసారు. పంజాబ్ పోలీసులతో కలిసి ఆర్మీ సైనికులు ఆ పరిసరాలను చుట్టుముట్టి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. తిబ్రీ గ్రామంలో కనబడిన ఇద్దరు అనుమానితుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుదవారం రాత్రి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ ని తెరిచి చూపించమని పోలీసులు అడిగినప్పటికీ అతను చూపించకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మార్క్ : గవర్నర్‌తో పాటు మాజీ న్యాయమూర్తికి మరకలే..!

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఇబ్బందులు పడుతున్న వారి జాబితాలో.. నిన్నటిదాకా అధికారులే ఉండేవారు.. ఇప్పుడు.. గవర్నర్, మాజీ న్యాయమూర్తులు కూడా ఆ జాబితాలో చేరినట్లయింది. ఆర్టికల్ 213...

హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు తీసుకుంటున్నా : రమేష్‌కుమార్

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా తనను తొలగిస్తూ... తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. కాసేపటికే... నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు మేరకు తాను.. ఎస్‌ఈసీగా బాధ్యతలు...

కళ్యాణ్ : బాలయ్య తీరు మారాలంటున్న నిజమైన టిడిపి అభిమానులు

నటుడు నందమూరి బాలకృష్ణ, " కెసిఆర్ తో సినీ పరిశ్రమ సమావేశానికి నన్నెవరూ పిలవలేదు, ఈ సినీ పరిశ్రమ వాళ్లంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా" అంటూ చేసిన...

రమేష్‌కుమార్ తొలగింపు చెల్లదు…! హైకోర్టు సంచలన తీర్పు..!

స్టేట్‌ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న రమేష్ కుమార్‌ను తొలగించేలా.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది చెల్లదని స్పష్టం చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమారే కొనసాగుతారని స్పష్టం...

HOT NEWS

[X] Close
[X] Close